కథలు చెప్తారు కొంతమంది
హౌసింగ్ బిల్లులు రూ26 లక్షలు
కాంట్రాక్టర్లు డబ్బుతో సంక్షేమ పధకానడుతున్నారు
బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
కాంట్రాక్టర్లు పనులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వము రూ 400 కోట్లు ఎగ్గొట్టి వీధిన పడేటట్లు చేసిందని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి దుయ్యపట్టారు. సోమవారం స్త్రీ శక్తి భవనంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో కట్టిన బిల్డింగ్ లకు బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు అప్పు తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పు ఇచ్చినట్లు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రజల డబ్బుతో సంక్షేమ పథకాలు నడుపుతున్నారా అని ఆలోచనలో పడాల్సిన పరిస్థితి నేడు ఉందన్నారు.
కార్యకర్తలు ఏదో పని చేస్తే ఆ బిల్లులు రాక వడ్డీకి వడ్డీ పెరిగి బ్రతకాలా చనిపోవాలా అనే సందిగ్ధంలో నేడు ఆంధ్ర రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని పనులు చేసిన వారు పరిస్థితి నెలకొని ఉందన్నారు.
చెప్పుకునేందుకే పథకాలు :-
రాష్ట్రానికి ఇన్ని పనులు మంజూరు చేసాం అభివృద్ధి చేశాం అని గొప్పలు చెప్పుకునేందుకే ఈ పథకాలు ఉండాయి అన్నారు గడప గడపకి మన ప్రభుత్వంలో మండలములో 160 పనులు మంజూరైతే కేవలం 59 పనులు మాత్రమే పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగతా పనులు ఎందుకు ప్రారంభించలేదని ఆయా గ్రామ సర్పంచు లను అడిగితే మేము పనులు చేయలేం చేసిన పనులకు డబ్బులు రాలేదు పూర్తిగా అప్పులు పాలైపోయాం డబ్బు రాణి పనులు నేను చేయడం ఎందుకు? అని వర్క్ ఆర్డర్లు తీసుకోకుండా పోయారని తెలిపారు.
రైతులకు ఆశపెట్ట మోసం చేయవద్దు :-
రైతులకు ఒక టీఎంసీ నీళ్లు ఇస్తామని చెప్పి ప్రస్తుతానికి 250 క్యూసిక్కులు నీళ్లు వదిలి మోసం చేయడం దారుణమన్నారు. అప్పులు చేసి ప
స్తున్న రైతులను మబ్బి పెట్టే పరిస్థితి చేయడం ఏమిటని మండిపడ్డారు. ఇప్పటికే అధిక పెట్టుబడులు రైతులు పంటలకు పెట్టేశారు. ఉన్నది ఉన్నట్టు చెప్పండి రైతులతో ఇలా ఎందుకు మోసమైన మాటలు చెప్పి మోసం చేస్తున్నారు పెట్టుబడి భారం పెరుగుతుంది అని మండిపడ్డారు.
పట్టాదార పాస్ పుస్తకులు ఎందుకు లేవు :-
మండలంలో 12 వేల ఎకరాల్లో ఒరిస్సాగు రైతులు సాగు చేస్తుంటే కేవలం 6923 ఎకరాలు మాత్రమే పంట నమోదు కార్యక్రమం చేయడం దారుణం అన్నారు. అందరికీ పొలాలు ఉన్నాయి ఆ పొలాలకు సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నాయి రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంతో పాసు పుస్తకాలు లేకుండా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల అందక చాలామంది రైతులు నిరుత్సా హస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. డాక్యుమెంట్స్ ఉంటే ఎందుకు పాసు పుస్తకాలు మంజూరు చేయడం లేదని రెవెన్యూ అధికారులను నిలదీశారు. సాదాబై నామ కింద పాస పుస్తకాల ఇవ్వచ్చు కదా వ్యవసాయ శాఖ అధికారులు ఎందుకు సిఫారిసు రెవెన్యూ అధికారులకు చేయ లేదు అని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో గ్రామ సభలు పెడుతున్నారా..! రీ సర్వే పూర్తయిందా రీ సర్వే పూర్తయిన గ్రామాలైన పూర్తిగా పట్టా దార పాసు పుస్తకాలు ఇచ్చారా..
అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
చిత్ర విచిత్రంగా జవాబులు చెప్తున్నారు :-
కొన్ని సచివాలయాలు పూర్తయి రెండేళ్లు అయింది వాళ్లకి బిల్లులు మంజూరు చేయకుండా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉండారు. ప్రశ్నలు అడుగుతుంటే చిత్రవిచిత్రాలుగా జవాబులు చెబుతున్నారని అధికారులపై మండపడ్డారు మనం పని చేస్తున్నాం మనం ప్రభుత్వము తగ్గా పారితో చేస్తుంది కాంట్రాక్టర్లు మనకు పని చేసి బిల్డింగులు ఇస్తూ ఆ బిల్లులు కోసం నెలల కొద్ది మన చుట్టూ తిరగాలా అని మండిపడ్డారు.
కథలు చెప్పారు కొంతమంది నాయకులు :-
వెంకటగిరి – గూడూరు రోడ్డు మార్గం బంగారు పేట నుంచి తిప్
తిప్పారపాడు వరకు రూ40 కోట్లతో
సి ఆర్ ఎఫ్ ఫండ్ నిధులు మంజూరు చేయిస్తే రూ 10 కోట్లు పెట్టి కాంట్రాక్టర్ పనులు ప్రారంభిస్తే ప్రభుత్వం రూపాయి బిల్లి ఇవ్వకపోవడంతో అతను ఖర్చుపెట్టిన 10 కోట్లు ఇవ్వండి ఆ డబ్బు ఈ రోడ్డు పనులకి ఉపయోగిస్తామని చెప్పారు
ఆ డబ్బులు మంజూరు చేయకుండా నేను ఆ పనులు ఆపమనాన్ని కొంత మంది కథలు చెప్పారు. పేపర్లలో ప్రకటనలు ఇచ్చారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణ చేత వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేత ఈ రోడ్డు పనులు ప్రారంభించా. నాకు ఉన్న పరిచయాలతో ప్రిన్సిపల్ ఆఫ్ సెక్రెటరీ అర్జీలు పెట్టి 40 కోట్ల 32 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆ పనులు కాంట్రాక్టర్ నిలిపేస్తే నాపై కాకమ్మ కథలు చెబుతున్నారు కొంతమంది నాయకులని మండిపడ్డారు.
20 గ్రామాలకు వైద్య సేవలు :-
మేల్చూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరైతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి జయంపు గ్రామంలో కట్టితే 20 గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందుతాయని జయింపు గ్రామానికి మంజూరు చేయడం జరిగిందన్నారు. మీరు జయంపు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్ డి ఎం అండ్ హెచ్ ఓ తో మాట్లాడతా రెండు రోజుల్లో జయంపు గ్రామములో చుట్టూ ప్రక్క ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పారు. వచ్చేది ఎండాకాలం తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలన్నారు ఎక్కడైతే బోర్లు మరమ్మతులు అయి ఉన్నాయో వాటిని క్రాష్ ప్రోగ్రామ్ ద్వారా మనమతులు చేసి వెంటనే తాగుడు ఇంటికి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఏ అరుణ, ఎంపీపీ గూడూరు భాస్కర్ రెడ్డి, మండల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో :-మాట్లాడుతున్న ఆనం