వెలగపూడి : రాజధాని రైతుల కౌలు చెల్లించే కేసులో సీఆర్డీఏ, రాష్ట్ర
ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. రైతులకు కౌలు
చెల్లింపు పిటిషన్పై హైకోర్టులో విచారణకు రాగా రైతుల తరపున సీనియర్ న్యాయవాది
ఉన్నమ్ మురళీధర్ వాదనలు వినిపించారు. రైతులకు కౌలు చెల్లించేందుకు జీవో ఇచ్చి
ఆపై ప్రభుత్వం కౌలు చెల్లించలేదని న్యాయవాది చెప్పారు. ప్రతి ఏడాది మేలో కౌలు
చెల్లించే వారని కానీ నేటి వరకు కౌలు చెల్లించలేదని తెలిపారు. మురళీధర్ వాదనలు
హైకోర్టు రికార్డు చేసింది. ఈ కేసుకు సంబంధించి సీఆర్డీఏ, ప్రభుత్వానికి
నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.