ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఏపిజేఏసి అమరవతి మహిళా విభాగం కేపిటల్ యూనిట్ చైర్ పర్సన్ గా డి.జి.పి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసే పి. శ్రీదేవి, ప్రధాన కార్యదర్శిగా సుగర్ కేన్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసే యం.వాణి ఎంపిక
విజయవాడ : భారత దేశంలో మహిళలలు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నాసరే వారికి ఏర్పడే ఇబ్బందులు ఒక్కటిగానే ఉంటాయికాబట్టి ప్రభుత్వాలు మాత్రం కేంధ్రప్రభుత్వం లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు చైల్డుకేర్ లీవ్ లు రెండు సంవత్సరాలు ఇస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఆరునెలలు మాత్రమే చైల్డుకేర్ లీవులు ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయమని కావున కేంధ్రంలో పనిచేసినా,రాష్ట్రంలో పనిచేసిన మహిళా ఉద్యోగు లందరికీ సమాన హక్కులు, రాయితీలు,సౌకర్యాలు కల్పించి స్టేట్ గవర్నమెంటు ఉమెన్ ఉద్యోగులందరికీ కూడా వర్తించేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు విజ్ఞప్తి చేసారు. గురువారం రెవిన్యూభవన్ లో ఏపిజెఏసి అమరావతి కేపిటల్ యూనిట్ ఉమెన్ వింగు కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళా ఉద్యోగులూ అన్ని రంగాలలో రాజకీయంగా గాని, ఉద్యోగపరంగా గాని ఏ అవకాశం ఇచ్చినా సరే విజయవంతంగా పనిచేస్తున్నారు. నేడు మహిళా ఉద్యోగులు అన్ని రంగాలలో 50 శాతం వరకు పనిచేసే పరిస్దితులు ఉన్నాసరే మహిళలలు కనీసం పనిచేసే ప్రదేశాలలో టాయిలెట్సు సౌకర్యాలు కూడా లేని పరిస్దితులు చాలా చోట్ల ఉన్నాయి.ఆపరిస్దితిలేకుండా అన్నిచోట్లా టాయిలెట్సు సౌకర్యలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ లు వేయాలని, శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని,
చైల్డుకేర్ లీవులు కేంధ్ర ప్రభుత్వఉద్యోగుల మాదిరిగా రెండు సంవత్సరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపిజేఏసి ఉమెన్ వింగు స్టేట్ చైర్ పర్సన్ పారేలక్ష్మి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నూరు విజయలక్ష్మి,అసోషియేట్ చైర్ పర్సన్ సైకం శివకూమారిరెడ్డి, కోశాధికారి గంటాపావని తోపాటు కేపిటల్ జేఎసి చైర్మన్ ఆర్.దుర్గా ప్రసాధ్,ప్రధానకార్యదర్శి మందపాటి శంకరరావు, ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర కమిటి నాయకులు బి.కిశోర్, డి.ఈశ్వర్,యన్టీఆర్ జిల్లా రెవిన్యూ అసోషియేషన్ అద్యక్షులు డి. శ్రీనివాస్ ,బత్తిన రామకృష్ట,జిల్లా ఉమెన్ కమిటి చైర్ పర్సన్ జి.జ్ఞానలలితో పాటు అధికసంఖ్యలో మహిళాఉద్యోగులు పాల్గోన్నారు.
కేపిటల్ యూనిట్ ఉమెన్ కమిటి నూతన కార్యవర్గం ఎంపిక
ఏపిజేఏసి అమరావతి కేపిటల్ యూనిట్ ఉమెన్ కమిటి చైర్ పర్సన్ పోలీసు శాఖ కు చెందిన పి.శ్రీదేవి, ప్రధానకార్యదర్శిగా షుగర్ కేన్ శాఖలో పనిచేసే
యం.వాణి, అసోషియేట్ చైర్ పర్సన్ గా పంచాయతీ రాజ్ శాఖ లో పనిచేసే సి.హెచ్ హరితా, రెవెన్యూ శాఖ లో పనిచేసే మోతీ షెక్ తో పాటు నలుగురు కో-చైర్ పర్సన్ గాను,మరోనలుగు ను కార్యదర్శులుగా ఎంపిక చేయడమైనది.వీరందరితో స్టేట్ ఉమెన్ కమిటీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పొన్నూరు విజయలక్ష్మి ప్రమాణస్వీకారం చేయించారు.