ఎమ్మెల్సీ, డిప్యూటీ మేయర్ లతో కలిసి
రూ. 18.90 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
విజయవాడ : ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వ ఆకాంక్ష అని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు తెలిపారు. రూ. 18.90 లక్షల నిధులతో లూనా సెంటర్ అంబేద్కర్
పార్కులో వాకింగ్ ట్రాక్, ఇండోర్ జిమ్ పరికరాలు, పిల్లల ఆటవస్తువులతో పాటు
లైటింగ్ ఏర్పాటు పనులకు ఎమ్మెల్సీ ఎండి రుహల్లా, నగర డిప్యూటీ మేయర్ అవుతు
శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాలతో సోమవారం ఆయన
శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ కరోనా తర్వాత
ప్రజలందరూ వ్యాయామంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని తెలిపారు. అటువంటి వారి
కోసం అంబేద్కర్ పార్కు జిమ్ లో అత్యాధునిక పరికరాలను సమకూర్చడం
జరుగుతోందన్నారు. దీంతో పాటు చిన్నారులను ఉల్లాస పరిచేందుకు అవసరమైన ఆట
వస్తువులతో పాటు విశాలమైన వాకింగ్ ట్రాక్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు
తెలిపారు. అలాగే స్థానిక యువత, విద్యార్థుల కోసం ఈ ప్రాంతంలో ఒక అత్యాధునిక
గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కూడా ఆలోచన చేస్తున్నట్లు
తెలియజేశారు. గత తెలుగుదేశం హయాంలో నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి నోచుకోని
ఈ ప్రాంతం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఓ మోడల్ డివిజన్ గా
రూపుదిద్దుకుంటోందని తెలియజేశారు. స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా
మాట్లాడుతూ స్థానిక ప్రజల ఆకాంక్షను తన దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే నిధులు
మంజూరు చేయించి, ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తోన్న ఎమ్మెల్యే
మల్లాది విష్ణు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అంబేద్కర్, డీఈ రామకృష్ణ, ఏఈ అరుణ్ కుమార్,
ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు హఫీజుల్లా, దేవిరెడ్డి రమేష్ రెడ్డి,
సురేష్, ఆసి బాబు, టైలర్ భాష, నజీర్, తమ్మిశెట్టి రాజు, మేడా శ్రీను, నేరెళ్ల
శివ, చింతా శ్రీను, విజయ్ కుమార్, కొండలరావు, మున్షీ, సచివాలయ సిబ్బంది,
పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.