విజయవాడ : అమెరికాలోని వివిధ రాష్ట్రాల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ
అగ్రనేత రాహుల్ గాంధీ జూన్ 4వ తేదీన న్యూయార్క్ లోని ప్రవాస భారతీయుల
సమావేశాన్ని జయప్రదం చేయాలని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ప్రవాస
భారతీయులకు పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో
రుద్రరాజు మాట్లాడుతూ భారతదేశంలో అనేక సవాళ్లు సమస్యలు ఉన్నాయన్నారు. దేశ
ప్రగతి పురోగతి కోసం అభివృద్ధి గురించి చర్చించడానికి రాహుల్ గాంధీకే
వినిపించడం కోసం ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
సుమారు 200 మంది ప్రవాస భారతీయులు హాజరైన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 4న
రాహుల్ గాంధీ అమెరికాలోని వివిధ రాష్ట్రాల పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు
న్యూయార్క్ లోని జావేద్ సెంటర్ లో ఉన్న ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు.
ఈ సమావేశానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షులు,
ఇతర పార్టీ పెద్దలు హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం
చేయాలని అమెరికాలోని ప్రవాస భారతీయులను పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయుల
సమావేశంలో ఆయనతోపాటు ఏఐసీసీ సెక్రటరీ ఇంచార్జ్ ఐ.ఓ.సి. ఆర్తీ కృష్ణాజి,
రాజేశ్వర్ గంగసాని, ప్రదీప్ శ్యామలా, శ్రీనివాసరావు భీమినేని, రామ్మోహన్ రావు
గాదుల, బొర్ర సుజన సాయి , పవన్ దర్శి తో పాటు కాంగ్రెస్ పెద్దలు భారీగా
పాల్గొన్నారు.