విజయవాడ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శిక్షపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు
ఇచ్చిన ఉత్తర్వులు ఆహ్వానిస్తున్నామని, ఇది ప్రధాని నరేంద్ర మోడీ , హోంమంత్రి
అమిత్‌షా లకు చెంపపెట్టు వంటిదని ఏపీసీసీ నేత తులసిరెడ్డి అన్నారు. శనివారం
ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రబుత్వం ఇప్పటికైనా కక్ష సాధింపు ధోరణి
మానుకోవాలని హితవు పలికారు. ఎంత వేగంగా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారో
అంతేవేగంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీని ప్రధాని కాకుండా
అడ్డుకోవాలనే కుట్రతో చేసిన చర్యలకు అడ్డుకట్ట పడిందన్నారు. తెలుగుదేశం
అధినేత చంద్రబాబునాయుడు యాత్రను అడ్డుకోవాలని వైసీపీ నాయకులు అడ్డుకోవడం
అప్రజాస్వామికమని అన్నారు.ఇది పూర్తిగా పోలీనుల వైఫల్యంలా ఉందన్నారు. లా అండ్
ఆర్డర్ కాపాడాల్సింది పోలీస్లేనని చెప్పారు.దెబ్బలు తగిలాయని సానుభూతి
చూపాలనుకోవడం వైసీపీ నేతలకు సరికాదన్నారు.ప్రపంచ నియంతలే కాలగర్భంలో కలిసి
పోయారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి కాంగ్రెస్సూ చిస్తుందన్నారు.ఇటీవల
వరద భీభత్సం సృష్టించిందని ఈ వరదల్లో ఎంతోమంది నిరాశ్రయిలయ్యారని ఆందోళన
వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వర్షాలు వరదలకు నిరాశ్రయులైన వరద బాధితులను
ఆదుకోలేదని కనీసం పరామర్శించలేదని వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా
విమర్శించారు. టిడిపి, జనసేన, వైసీపీ, బిజెపిలు దుష్ట చతుష్టయాలని తులసి
రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాబోయే ఎన్నికలలో ఓడించాలని
పిలుపునిచ్చారు. శనివారం ఆంధ్ర రత్న భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో
మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారిపై ఆక్రమ కేసులు బనాయించి చివరికి సుప్రీంకోర్టు
ధర్మాసనం ఇచ్చిన తీర్పు వలన బిజెపి ప్రభుత్వం సిగ్గుపడాలని ఆయన ప్రధాని మోడీపై
నిప్పులు చెరిగారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు
గుణపాఠం చెప్పబోతున్నారని ఆయన వెల్లడించారు మణిపూర్ హింసాత్మక ఘటనలోనూ బిజెపి
ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు ఈ సమావేశంలో ఆయనతోపాటు ఎస్సీ సెల్
నాయకులు వినయ్ కుమార్ లీగల్ సెల్ చైర్మన్ గురునాథం డాక్టర్ జంధ్యాల శాస్త్రి
బైపూడి నాగేశ్వరరావు కాజా మొహిద్దిన్ కొమ్మినేని సురేష్ ఇతర నాయకులు
పాల్గొన్నారు.