నరేంద్ర మోడీ ‘టార్గెట్ 150’
గుజరాత్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ అన్నీ తానై బీజేపీని నడిపిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత వెంటాడుతున్నా ‘నన్ను చూసి ఓటేయండి’ అంటూ ప్రజలకు
పిలుపునిస్తున్నారు. గెలుపుపై ధీమా ఉన్నా సాధారణ విజయం సరిపోదని మోడీ
భావిస్తున్నారు. రికార్డులు బద్దలు కొట్టేలా పనిచేయాలని శ్రేణులకు
పిలుపునిస్తున్నారు.
గుజరాత్లో భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచార సరళిని
చూస్తుంటే.. ఏడోసారి ఎలాగైనా గెలవాలని కాషాయదళం కంకణం కట్టుకుందని
అర్థమవుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందనే
భయాలు, పలు నియోజకవర్గాల్లో రెబల్స్ సమస్య వెంటాడుతున్నా.. గెలుపుపై మాత్రం
ధీమాతోనే ఉంది. క్షేత్రస్థాయిలో చూస్తే భాజపాదే విజయమని చాలా వరకు స్పష్టంగా
తెలుస్తోంది. బీజేపీ ప్రత్యర్థులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు.అయితే,
ఈసారి రాష్ట్రంలో ఎప్పటిలాగే గెలిస్తే సరిపోదనిరికార్డు మెజార్టీతో విజయం
సాధించాలని నరేంద్ర మోడీ భావిస్తున్నట్లు సమాచారం. గతంలో నమోదైన రికార్డులను
తిరగరాయాలని ఆయన సంకల్పించుకున్నారు. 1985లో మాధవ్సిన్స్ సోలంకి కాంగ్రెస్‌ను
గెలిపించిన మాదిరిగానే బీజేపీ రికార్డు విజయం సాధించాలని మోదీ అనుకుంటున్నట్లు
తెలుస్తోంది. గుజరాత్ అసెంబ్లీలో 182 సీట్లు ఉన్నాయి. 1985లో జరిగిన
ఎన్నికల్లో సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 149 సీట్లు గెలుచుకుంది. మోడీ
హవా ఓ రేంజ్లో ఉన్న కాలంలో కూడా భాజపా ఈ స్థాయిలో సీట్లు గెలుచుకోలేదు. ఈ
నేపథ్యంలోనే తాజాగా ఈ రికార్డుపై మోదీ కన్నేసినట్లు తెలుస్తోంది. 150 సీట్లలో
గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ కార్యవర్గానికి దిశానిర్దేశం చేసినట్లు
సమాచారం. అయితే బీజేపీ చాణక్యుడు అమిత్ షా లెక్క మాత్రం మరోలా ఉంది. కాస్త
వాస్తవిక కోణంలో ఆలోచించే షా గుజరాత్లో 130 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని
భావిస్తున్నట్లు సమాచారం.
లెక్కలపై మక్కువెందుకో?
రికార్డు స్థాయి విజయంపైనే ఎందుకు వ్యామోహం అని అడిగితే అందుకు కారణాలు
లేకపోలేదు. భారీ విజయం సాధించడం ద్వారా గుజరాత్‌పై తాము ఏమాత్రం పట్టు
కోల్పోలేదని నరేంద్ర మోడీ తన విరోధులకు చాటిచెప్పవచ్చు. కేజ్రీవాల్
నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వంటి కొత్తవారు బరిలో దిగినా తమ అధికారానికి
ఢోకా లేదని నిరూపించుకోవచ్చు. ఉచిత పథకాలకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ ఈ
ఎన్నికల్లో ఎలాంటి ఉచితాలపై వాగ్దానాలు చేయలేదు. అయినప్పటికీ, ప్రజలు తమ వెంటే
ఉన్నారని నిరూపించుకోవడం బీజేపీ కి అవసరం. రెండు అంశాలు తమకు కలిసొస్తాయని
బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. వీటిని తమకు అనుకూలంగా మలచుకొని పనిచేయాలని
నరేంద్ర మోడీ సూచించినట్లు చెబుతున్నాయి. మొదటిది ఆప్! రెండు నెలల క్రితం ఫుల్
జోష్‌తో గుజరాత్ ఎన్నికల్లోకి అడుగుపెట్టింది ఆమ్ ఆద్మీ. అయితే, అభ్యర్థుల
పేర్లు ప్రకటించిన తర్వాత ఈ వేగం నెమ్మదించింది. అభ్యర్థుల్లో చాలా మంది
కొత్తవారే ఉండటం ఆప్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని భాజపా భావిస్తోంది.
మరోవైపు, ఆప్ ఒకవేళ ఎన్నికల్లో మెరుగ్గా పోరాడినా అది బీజేపీ కే కలిసొచ్చే
అవకాశం ఉంది. చాలా వరకు కాంగ్రెస్ ఓటు బ్యాంకుకే ఆప్ కన్నం వేస్తుందని
తెలుస్తోంది. ఇలా, ప్రభుత్వ వ్యతిరేక ఓటును రెండు పార్టీలు చీల్చడం ద్వారా
బీజేపీ లాభపడుతుందని కమలదళం భావిస్తోంది. దీంతో 2017 ఎన్నికల్లో తగ్గిన
మెజార్టీని మరింత పెంచుకోవచ్చని అనుకుంటోంది.
అయితే, ఇప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేకత సాధారణమైనది కాదు. మోడీ హయాంలోని
రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వంతో పోల్చుకుంటున్నారు ప్రజలు.
మోదీ దిగిపోయిన తర్వాత రాష్ట్ర సర్కారు పటిష్ఠంగా లేదని భావిస్తున్నారు. కానీ,
ఇప్పటికీ గుజరాత్లో మోదీ వ్యక్తిగత చరిష్మాకు తిరుగులేదు. ప్రజలు మోదీపై
విశ్వాసం ఉంచుతున్నారు. అందుకే, గుజరాత్లో పర్యటించిన తొలి సభలోనే ఎన్నికల
బాధ్యతనంతా తన భుజాన ఎత్తుకున్నారు. ‘ఈ గుజరాత్‌ను తయారు చేసింది నేనే’ అంటూ
కొత్త నినాదాన్ని వినిపించారు. అప్పటి నుంచి గుజరాత్లో పర్యటించిన ప్రతిసారి
విపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. భాజపాదే అధికారమంటూ
చెబుతున్నారు. నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా ఇచ్చే హామీలపై ప్రజలకు విశ్వాసం
ఉంది. అది భాజపాకు తప్పక పనికొస్తుంది. అందువల్లే మోదీ ఈ విషయంలో వెనక్కి
తగ్గడం లేదు. తనను చూసి ఓటు వేయాలని స్పష్టంగా చెబుతున్నారు. ఇదివరకు జరిగిన
హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో అయినా ప్రస్తుత గుజరాత్ ప్రచారంలో అయినా ఈ
విషయంలో సంకోచించడం లేదు.