బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరితగతిన చెల్లించాలని ఎస్ టీయు జిల్లా అధ్యక్షుడు కోడూరు. రమేష్ బాబు పేర్కొన్నారు.బుధవారం తహసీల్దారు కి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ,పెన్షనర్ల పరిష్కారం చేయాలి వినత పత్రం అందజేశారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కొరకు1. 12 వ పీటర్ సి లో మధ్యంతర భృతి (ఐఅర్) 30% తక్షణమే చెల్లించాలి.పెండింగులో ఉన్న రెండు కొత్త డీఎంకే లు (1-1-2023 & 1-7-2023) విడుదల చేయాలి. సిపిఎస్ వారికి డీఎ అరియర్సు.. 90% నగదుగా చెల్లించాలి.జిపోఎఫ్, ఎపిజిఎల్ఐ. లోన్స్ క్లైమ్స్ ,11వ పీటర్ సీ అరియర్సు, డీఎ అరియర్సు సరెండర్ లీవ్ బకాయిలు, మెడికల్ రియంబర్స్ మెంట్ బిల్లు చెల్లించాలి.సిపీఎస్/జిపీఎస్ రద్దు చేసి ఓపిఎస్ ను అమలు చెయ్యాలి. 1-9-2004 కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకం పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓపిఎస్ అమలు చేయాలి. అన్ని నెట్ వర్క్ హస్పటల్స్ లో హెచ్ కార్డ్ ద్వారానగదు రహిత వైద్యం అందించాలి.ఉపాధ్యాయుల కు అప్రెంటిస్ విధానము రద్దు చెయ్యాలి. జి.ఓ. నెం. 117 రద్దు చేయాలి.గురుకులాలు, సొసైటీస్, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు 60 నుండి 62 సం.లకు పదవి విరమణ వయస్సు పెంచాలి.జెడ్పి యాజమా న్యములో జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్ల పోస్టులను అప్ గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలి.ప్రతి నెలా 1 వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించాలి.పదవి విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరితగతిన చెల్లించాలి.ఈకార్యక్రమంలో ఉపాధ్యియులు
పాల్గొన్నారు.
పోటో:-వినత పత్రం అందజేస్తున్న దృశ్యం