‘దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2023’లో ప్రదానం
‘కాంతార’ మూవీతో మరోసారి దక్షిణాది చిత్రాల సత్తా చాటిన దర్శకుడు రిషబ్
శెట్టి. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. భారీ వసూళ్లతో బాక్సాఫీసును
బద్దలకొట్టింది. తాజాగా రిషబ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 20న ముంబయిలో
తాజ్ ల్యాండ్ ఎండ్ హోటల్లో జరగనున్న ‘దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్
ఫెస్టివల్-2023’లో రిషబ్ ‘ది మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్’ అవార్డును
అందుకోనున్నారు. సెంట్రల్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, దాదాసాహేబ్ ఫాల్కే
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సీఈవో అభిషేక్ మిశ్రా బుధవారం లేఖ ద్వారా ఈ
విషయాన్ని వెల్లడించారు.
కర్ణాటకకే పరిమితమైన ఈ నటుడు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన
విషయం తెలిసిందే. ఫిబ్రవరి 20న ముంబైలో ఈ అవార్డు వేడుక జరగనుంది. కాంతారా
చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి
తాజ్ ల్యాండ్ ఎండ్ హోటల్లో ఈ అవార్డును అందుకోనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వాటిలో ఒకటి.. ప్రతి సంవత్సరం అనేక మంది
ప్రతిభావంతులను ఈ అవార్డుతో సత్కరిస్తున్నారు. 2019లో యష్ KGF చాప్టర్ 1లో తన
నటనకు దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డును అందుకున్నారు.