న్యూఢిల్లీ : నీతి ఆయోగ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిశారు. రాష్ట్ర ఆర్థిక
పరిస్థితిని వివరించారు. ఆమెతో సుమారు 40నిమిషాలు సమావేశమయ్యారు. నాడు నేడు
పథకం, ఆరగ్యరంగాల్లో చేస్తున్న ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా భావించి
సాయం చేయాలని ఆమెను రిక్వస్ట్ చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర బడ్జెట్లో
పెట్టినట్టు ఆమెకు గుర్తు చేశారు. విద్య, వైద్య రంగంలో తీసుకొచ్చిన మార్పులు
గురించి ఆమెకు వివరించారు. తొలి దశలో 15వేలకుపైగా స్కూళ్లు అందుబాటులోకి
వచ్చాయని తెలిపారు. వైద్య రంగంలో కూడా నాడు నేడు కింద ఆసుపత్రులు
పునర్నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రెండు రంగాలపై వేల కోట్లు ఖర్చు
పెట్టామన్నారు సీఎం జగన్. వాటిని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా భావించి సాయం
చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు కారణంగా ఇప్పుడు రుణ
పరిమితి విధించారని వాటిలో సడలింపు ఇవ్వాలని నిర్మలా సీతారామన్‌ను జగన్
కోరారు. విభజన తర్వాత తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా చేసిందని దీనికి 6,756.92
కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ఆ బకాయిలు వచ్చేలా చూడాలన్నారు.