హైదరాబాద్ : 2023–2024 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్ ను
కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్ అంచనాలను
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.
దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. మూల ధన వ్యయం రూ. 37,585 కోట్లుగా
ఉంది. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,17,215గా ఉందని హరీశ్ రావు ప్రకటించారు. ఇక
బడ్జెట్లో వ్యవసాయానికి రూ. 26,931 కోట్లను కేటాయించింది. నీటి పారుదల శాఖకు
రూ. 26, 885 కోట్లు, విద్యుత్ కు రూ.12, 727 కోట్లు ఇచ్చింది. ఆసరా పెన్షన్ల
కోసం రూ. 12 వేల కోట్లు, దళితబంధు కోసం రూ. 17,700 కోట్లు, ఎస్సీ ప్రత్యేక
నిధి కోసం రూ. 36, 750 కోట్లు, ఎస్టీ ప్రత్యేక నిధి కోసం 15, 233 కోట్లు
కేటాయించింది. బీసీ సంక్షేమం కోసం రూ. 6229 కోట్లు, మహిళా, శిశు సంక్షేమం కోసం
రూ. 2,131 కోట్లు కేటాయింపులు చేసింది.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: హరీశ్‌రావు
హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంత్రలకు అనుగుణంగా ఉంటుందని
మంత్రి తెలిపారు. అసెంబ్లీకి బయల్దేరే ముందు జూబ్లీహిల్స్‌లో శ్రీవారికి
ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్షేమానికి అభివృద్ధికి బడ్జెట్లో సమ
ప్రాధాన్యాత ఉంటుందని ఆయన చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్‌ను
ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.