విశాఖపట్నం : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో సంక్షేమ
పథకాలే కాకుండా మౌలిక వసతుల కల్పనలో విశాఖ నగరాన్ని ప్రపంచ పటంలో గుర్తింపు
తెచ్చే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని నగర మేయర్ గొలగాని హరి వెంకట
కుమారి పేర్కొన్నారు. గురువారం ఆమె ఉత్తర నియోజకవర్గం 14 వ వార్డు పరిధిలో
బాలయ్య శాస్త్రి లేఅవుట్ లో రూ.309.66 లక్షల వ్యయంతో బిటి రోడ్డు, ఫుట్ పాత్
నిర్మాణానికి ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు, కార్పొరేటర్ అనిల్
కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ
సంక్షేమం, అభివృద్ధిలోనూ విశాఖ నగరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో
ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం జరుగుతుందని తెలిపారు. ఉత్తర నియోజక వర్గం
పరిధిలో ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం
జరిగిందని, 14వ వార్డు పరిధిలో బాలయ్య శాస్త్రి లేఅవుట్ ప్రాంత అభివృద్ధికి
సుమారు కోటి పది లక్షలు వెచ్చించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి
వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయంతో ఎంతోమంది
ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని, దాదాపు పదివేల మంది ఉద్యోగులను క్రమబద్ధీకరణ
చేయడం జరుగుతుందని, సిపిఎస్ ను రద్దుచేసి జిపిఎస్ ఏర్పాటు చేయడం వలన ఉద్యోగులు
పదవిరమణ పొందిన తర్వాత వారికి ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. నూతన పిఆర్సి
ఏర్పాటు, అమ్మబడి లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరో 30
సంవత్సరాల పాటు పరిపాలిస్తుందని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి
ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, కార్యనిర్వహణ ఇంజనీర్ శ్రీనివాసరావు,
వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు లంక భాస్కరరావు, సచివాలయం సెక్రటరీలు, స్థానిక
నాయకులు తదితరులు పాల్గొన్నారు.