తిరుమల : శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాలను
అందించేందుకు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఒకరోజు విరాళ పథకం కింద రూ.33
లక్షలు అందించవచ్చని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం అల్పాహారం కోసం
రూ.7.70 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.12.65 లక్షలు, రాత్రి భోజనానికి
రూ.12.65 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించవచ్చని
పేర్కొంది. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో
ప్రదర్శిస్తామని వెల్లడించింది.12 పేజీల టీటీడీ క్యాలెండర్లు అయిపోయాయి : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల
సందర్భంగా గత సెప్టెంబరులో తితిదే విడుదల చేసిన 2023వ సంవత్సరానికి సంబంధించిన
12 పేజీల క్యాలెండర్లు అయిపోయాయని టీటీడీ ప్రకటించింది. 12 పేజీల
క్యాలెండర్లనుటీటీడీ 13 లక్షలు ముద్రించి సెప్టెంబరు 27 నుంచి అందుబాటులోకి
తెచ్చింది. వీటిని భక్తులు పూర్తిగా కొనుగోలు చేశారు. తీవ్ర డిమాండున్న ఈ
క్యాలెండర్లు జనవరి ఒకటి నుంచి అందుబాటులో లేకుండాపోయాయి.