అమరావతి : ప్రభుత్వ హామీతో బ్యాంకుల నుంచి రూ.650 కోట్ల రుణాన్ని తీసుకోవాలన్న
ప్రతిపాదనను ఏపీ ఫైబర్‌నెట్ ఉపసంహరించుకుంది. భారత్ బ్రాడ్‌బ్యాండ్
నెట్వర్క్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్) ప్రాజెక్టులో కేంద్రం నుంచి వచ్చే
రూ.1,000 కోట్లతో పనులు పూర్తి చేసిన తర్వాత అవసరమైతే రుణాన్ని తీసుకోవాలని
భావిస్తోంది. బీబీఎన్ఎల్ ప్రాజెక్టు మొదటి దశలో మండల కేంద్రాల వరకు
ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ) లైన్లను ఏపీ ఫైబర్‌నెట్ ఏర్పాటు చేసింది.
అక్కడి నుంచి గ్రామాలకు సుమారు 20 వేల కి.మీల ఓఎఫ్సీ కేబుల్ ఏర్పాటు
చేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ హైస్పీడ్
ఇంటర్నెట్ సదుపాయం అందించడం సాధ్యమవుతుంది. దీనికి కేంద్రం రూ.1,000 కోట్లు
ఇస్తుంది. ప్రాజెక్టు వ్యయంలో 70 శాతాన్ని కేంద్రం గ్రాంటుగా ఇస్తే.. మిగిలిన
30 శాతాన్ని రాష్ట్రం భరించాలి. దీని కోసం రుణాన్ని తీసుకోవాలని అధికారులు
ప్రతిపాదించారు.ఇప్పటికే ఏటా రూ.60 కోట్ల నష్టాలు : ఏపీ ఫైబర్‌నెట్ నుంచి అందిన ప్రతిపాదన
మేరకు రూ.650 కోట్ల రుణాన్ని ఇవ్వడానికి బ్యాంకులు ముందుకువచ్చాయి. ఇందులో
మొదట రూ.400 కోట్లు తీసుకోడానికి అధికారులు సంసిద్ధత తెలిపారు. మిగిలిన
మొత్తాన్ని రెండో విడత తీసుకోవాలని భావించారు. దీనిపై రెండు రోజుల కిందట
జరిగిన బోర్డు సమావేశంలో సమీక్షించారు. రెండేళ్లుగా సంస్థకు ఏటా సుమారు రూ.60
కోట్ల మేర నష్టాలు వస్తున్నాయని కొత్త రుణాలు తీసుకుంటే సంస్థ మరింతగా
నష్టాల్లో కూరుకుపోతుందన్న అభిప్రాయాన్ని పలువురు బోర్డు సభ్యులు వ్యక్తం
చేశారని ఒక అధికారి తెలిపారు. కొత్తగా తీసుకునే రుణాల వల్ల చెల్లించాల్సిన
వడ్డీ భారంగా మారుతుందన్న ఉద్దేశంతో ఆ ప్రతిపాదన ఉపసంహరించామని చెప్పారు.