వెంకటగిరి ఎక్స్ప్రెస్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగాప్రవేశపెట్టిన ఆడదాం ఆంధ్ర రెండవ దశ బుధవారం నుండి ప్రారంభం కానున్నాయని వెంకటగిరి మండల ఇంచార్జ్ ఎంపీడీవో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఆట స్థలాలను పరిశీలించిన అనంతరం ఇంచార్జ్ ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలోని అన్ని సచివాలయాల నుండి వస్తున్న జట్లకు ఆహ్వానం పలుకుతూ క్రీడాకారులకు వెంకటగిరి పట్టణం లోని విస్వోదయ కాలేజ్ గ్రౌండ్, ఏపీ రెసిడెన్షియల్ బాలికోన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల సెటిల్ ఆడడానికి వెంకటేశ్వర ప్యాలెస్ దగ్గర ఇండోర్ స్టేడియాలను ఎంపిక చేసామని ఆయా ఆటలను ఇరుజట్లకు టాస్ ద్వారా పోటీలు ఉంటాయని అందరూ చక్కగా ఆడి మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి వరకు జగనన్న ప్రవేశపెట్టిన ఆటలు పోటీలలో గెలుపొందాలని కోరారు. ఈ పోటీలు గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు వెంకటగిరి మండలం నుండి వెళ్లాలని అలా ఆడాలనే ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ చక్కగా రాణించాలని కోరుతున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వారు ఏ ఆడ స్థలం దగ్గర ఉన్న అక్కడే వారికి ఆహారం, నీళ్లు అందివ్వడం జరుగుతుందని అన్నారు. కమిషనర్ వెంకటరమయ్య మాట్లాడుతూ ఈ పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులు విద్యతోపాటు శారీరక దృఢత్వాన్ని కలిగి ఆరోగ్యంగా ఉంటారని, పోటీ తత్వాన్ని ఈ ఆటలు పెంపొందిస్తాయని వెంకటగిరి పట్టణ మరియు రూరల్ క్రీడాకారులు మన ఊరు పేరు రాష్ట్ర స్థాయి వినిపించేలా మంచి పోటీ నివ్వాలని గెలుపొందాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు పాల్గొన్నారు.