వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా మరోసారి గందరగోళం
సృష్టించారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఒక దేశానికి బదులు మరో దేశం
పేరును ప్రస్తావించారు. బైడెన్ వృద్ధాప్యం కారణంగానే ఇలా గందరగోళంగా
మాట్లాడుతున్నారని కొందరు విమర్శిస్తున్నారు. షికాగో పర్యటనకు బయలుదేరే ముందు
శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఉక్రెయిన్ను ఓడించేందుకు తీవ్రంగా
ప్రయత్నిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా కిరాయి సైన్యం
తిరుగుబాటు చేసింది. దీంతో ఆయన బలహీనపడ్డారని అనుకుంటున్నారా’ అని విలేకరులు
ప్రశ్నించారు. దీనికి స్పందించిన బైడెన్.. ‘ఇరాక్‌తో జరుగుతున్న యుద్ధంలో
అతడు (పుతిన్) ఓడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్వదేశంలో అతడికి
వ్యతిరేకత ఎదురవుతోంది. ఆయన ఏకాకిగా మిగులుతున్నారు. కేవలం నాటో కూటమే కాదు..
ఐరోపా సమాఖ్య, జపాన్ ఇలా దాదాపు 40 దేశాలు ఆయనను ఒంటరి చేశాయి’ అంటూ
ఉక్రెయిన్‌కు బదులు ఇరాక్ పేరును పొరపాటున ప్రస్తావించారు. మంగళవారం జరిగిన
నిధుల సేకరణ కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన భారత్‌ను
ఉద్దేశించి మాట్లాడారు. ‘‘మీరు నా కొత్త స్నేహితుణ్ని చూసే ఉంటారు. ప్రపంచంలో
చిన్న దేశం ప్రధాని ఆయన.. కానీ ఇప్పుడదే పెద్ద దేశమైన చైనా.. కాదు
క్షమించండి.. అది భారత్’ అంటూ సరిదిద్దుకున్నారు.