తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’.. లోకేష్ కనకరాజ్
దర్శకత్వం వహిస్తున్నారు. మాఫియా కథాంశం నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ
చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘మాస్టర్’ తర్వాత విజయ్-లోకేష్ కనకరాజ్
కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలున్నాయి. కొద్ది
రోజుల క్రితం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుత మైన స్పందన లభించింది.
దర్శకుడు లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూని వర్స్ లో భాగంగా ఈ చిత్రాన్ని
తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా
తీయబోతున్నారని తెలిసింది. బాహుబలి, కేజీ ఎఫ్ తరహాలో రెండు భాగాలుగా ఈ
చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకుడు లోకేష్ కనక రాజ్ ప్రయత్నాలు
చేస్తున్నారని సమాచారం. ఆయన గత చిత్రాల తరహాలోనే మాఫియా, డ్రగ్స్ చుట్టూ నడిచే
కథాంశమిదని చెబుతున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం
అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకురానుంది.