భారత్ విజయం
దూకుడు పెంచిన అయ్యర్
రెండో టెస్టులో బంగ్లాపై భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ కష్టాలు పడింది. నాలుగో రోజు ఆదిలోనే కీలక వికెట్లను కోల్పోయింది. బంగ్లాతో టెస్టు సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి తీవ్రంగా కష్టపడింది. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోతూ.. కష్టాల్లో పడింది. 45/4 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్.. ఆదిలోనే మూడు వికెట్లను కోల్పోయింది. అనంతరం అయ్యర్(29), అశ్విన్(42) నిలకడగా ఆడుతూ కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. బంగ్లా బౌలర్లలో మిరాజ్ 5 వికెట్లు తీయగా షకీబ్ 2 వికెట్లు తీశాడు.
బంగ్లా తొలి ఇన్నింగ్స్ : 227
భారత్ తొలి ఇన్నింగ్స్ 314
బంగ్లా రెండో ఇన్నింగ్స్ : 231
భారత్ రెండో ఇన్నింగ్స్ : 145/7
దూకుడు పెంచిన అయ్యర్ : శ్రేయస్ అయ్యర్ దూకుడు పెంచాడు. షకీబ్ వేసిన 41వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ప్రస్తుతం 42 ఓవర్లు ముగిసేసరికి భారత్ 7 వికెట్ల నష్టానికి 111 పరుగులతో ఆడుతోంది. విజయానికి ఇంకా 34 పరుగులు కావాల్సి ఉంది. నాలుగో రోజు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిన అనంతరం భారత్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లు ముగిసేసరికి భారత్ 7 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. విజయానికి 50 పరుగుల దూరంలో ఉంది. క్రీజులో అశ్విన్ (7), అయ్యర్ (14) ఉన్నారు. బంగ్లాతో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి పోరాడుతున్నారు. ప్రస్తుతం 37 ఓవర్లు ముగిసేసరికి భారత్ 7 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. క్రీజులో అయ్యర్ (10), అశ్విన్(4) ఉన్నారు. భారత విజయానికి ఇంకో 57 పరుగులు కావాల్సి ఉండగా బంగ్లా విజయానికి 3 వికెట్ల దూరంలో ఉంది.
నాలుగో రోజు ఆట ప్రారంభం : ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్
బంగ్లాదేశ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ కష్టాలు పడింది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే టీమ్ఇండియా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. షకీబ్ వేసిన 25వ ఓవర్లో ఉనద్కత్ (13) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మెహిదీ వేసిన 28 ఓవర్ చివరి బంతికి పంత్ (9) కూడా ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి భారత్ 74 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(34), శ్రేయస్ అయ్యర్ ఉన్నారు.