విశాఖపట్నం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ స్థానం నుంచి టీడీపీ
అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు విజయం సాధించారు. టీడీపీ మద్దతుతో
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం (ఉత్తరాంధ్ర) పట్టభద్రుల నియోజకవర్గ
శాసనమండలి అభ్యర్థిగా పోటీచేసిన ఆయన తొలి నుంచి స్పష్టమైన ఆధిక్యతతో
దూసుకెళ్లి సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి అయిన సీతంరాజు సుధాకర్‌పై
గెలుపొందారు. అంచనాలను మించి తొలి ప్రాధాన్య ఓటులో భారీగా ఓట్లు
సాధించినప్పటికీ గెలుపునకు కావాల్సిన ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లతో
ఘన విజయం సాధించారు.