నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి.
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్
ప్రజల సమస్య లు పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం అన్ని మండలాల్లో రెవిన్యూ సదస్సు లను నిర్వహిస్తుందని వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి చెప్పారు. కలువాయి తహసీల్దార్ కార్యాలయం వద్ద జిల్లా జాయింట్ కలెక్టర్ కుర్మా నాద్ రెవిన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు లో నేదురుమల్లి పాల్గొని మాట్లాడారు.ఈ సందర్బంగా మండలం లోని అన్ని గ్రామాల నుంచి భూ సమస్యల మీద ప్రజలు జేసీ కి అర్జీ లు ఇచ్చారు. ఈ సందర్బంగా కొన్ని సమస్య లను జేసి అక్కడికక్క డే పరిష్కారించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…ప్రజలు రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని భూ సమస్య లు పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లా అధికారులందరు ప్రజల సమస్య లు తెలుసుకొని పరిష్కారిస్తారని చెప్పారు.ఈ సందర్బంగా వైసీపీ నాయకులు నేదురుమల్లిని పువ్వులు బుకే లతో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ అనీల్ కుమార్ రెడ్డి, ట్రైని కలెక్టర్ సంజన సిన్హా, ఆత్మకూరు ఆర్ డి ఓ మధులత, కలువాయి డీప్యూటీ తహసీల్దార్ మంజుల రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
……………………..
మాట్లాడుతున్న రామకుమార్ రెడ్డి. ఫోటో రైటప్