విజయవాడ : 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ లెనిన్ సెంటర్ లోని
రెవెన్యూ భవన్ లో జాతీయ జెండాను ఏ.పీ అర్.యస్.ఏ రాష్ట్ర అధ్యక్షుడు , ఏపీ
జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. గణతంత్ర
దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర
అధ్యక్షుడు, ఎపిజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా
మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ ,కార్మిక, కాంట్రాక్ట్,
ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ 74వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
తెలియజేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్న
సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు భారత ప్రజలందరూ అనుభవిస్తున్న స్వేచ్ఛ సమానత్వాలు
ఆనాడు ఎందరో నాయకులు త్యాగ ఫలాలు అని గుర్తు చేస్తూ బాబు రాజేంద్రప్రసాద్
చైర్మన్ గా ఉన్న భారత రాజ్యాంగ కమిటీ ఎన్నో దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన
ముఖ్యమైన అంశాలను జోడించి రచించినటువంటి అతి పటిష్టమైన, అతి దృఢమైన భారత
రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బి ఆర్.అంబేద్కర్ యొక్క కృషి, పట్టుదలను
కొనియాడారు. అతి ముఖ్యమైన భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చడం వల్ల
రాజ్యాంగం యొక్క విశిష్టత విద్యార్థి దశ నుంచే అందరికీ తెలిసి, వారి ఎదుగుదలకు
తోడ్పడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్
అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ చేబ్రోలు కృష్ణమూర్తి , రాష్ట్ర కార్య
నిర్వాహక కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా ఏపి అర్ యస్ ఏ జిల్లా
కార్యదర్శి బత్తిన రామకృష్ణ , వైస్ ప్రెసిడెంట్ యన్. శ్రీనివాస మూర్తి,
రాజేశ్వరి, విజయవాడ డివిజన్ ప్రెసిడెంట్ చింతకాయల అప్పారావు , కార్యదర్శి
యలమంచిలి రవి, ఏపి విఆర్వో సంఘం నాయకులు, ఏపీ జెఏసి అమరావతి రాష్ట్ర వైస్
చైర్మన్ బి.కిషోర్, సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల
సంక్షేమ సంస్థ నాయకులు, సిటీ జేఏసీ నాయకులు ధనుంజయ్, కోటేశ్వర రావు తదితరులు
పాల్గొన్నారు.