తిరుపతి, నవంబర్ 11: శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతి లో జరగనున్న 2020-21 సంవత్సరానికి సంబంధించిన 19 మరియు 20 వ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొనుటకు రేణిగుంట విమానాశ్రయంకు ఉదయం 11.35 కు చేరుకున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ గారికి ఘన స్వాగతం లభించింది. వారికి పుష్ప గుచ్చాలతో జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జే.సి డి కే బాలాజీ, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి తదితరులు ఘన స్వాగతం పలికారు.
వీరితో పాటుగా ఏఎస్పీ కుల శేఖర్, శ్రీకాళహస్తి ఆర్డీఓ రామారావు, గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్, ఏర్పోర్ట్ సి ఎస్ ఓ రాజశేఖర్, పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్లు శిరీష శారద తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.