రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
రాయలసీమ ఆత్మగౌరవ పోరాటంగా, రాయలసీమ వెనుకబాటు తనానికి సంబంధించిన అనేక
డిమాండ్లతో ఈనెల 5న కర్నూలులో ‘రాయలసీమ గర్జన’ సదస్సు నిర్వహిస్తున్నాం. 70
ఏళ్లుగా అనేక మోసాలకు గురవుతున్న రాయలసీమ ప్రాంత ప్రజల మనోభావాలను రాయలసీమ
వేదికగా స్పష్టం చేయాల్సి ఉంది. మేమంతా ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని
కోరుకునే గొప్ప మనసున్న వాళ్లం. రాజధానిని త్యాగం చేసినవాళ్లం. మా త్యాగాలను
చేతగానితనంగా చూడొద్దు. భవిష్యత్ తరాల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి
వచ్చింది. రాయలసీమ ప్రజలందరూ అభివృద్ధి వికేంద్రీకరణ కోరుతున్నారు.
రాష్ట్రంలోని16 వేల గ్రామాల్లోనూ అభివృద్ధి జరగాలి. రాయలసీమ, అమరావతి,
ఉత్తరాంధ్రలోనూ జరగాలి. అందరూ బాగుండాలి అనే వాదనను ఈనెల 5న కర్నూలులో జరిగే
‘రాయలసీమ గర్జన’లో వినిపించబోతున్నాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఇతర మేధావులు, రాయలసీమ వాదులందరూ
వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలి అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి
ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు.