హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది.
అమిత్ షా టూర్ షెడ్యూల్
ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కేంద్రమంత్రి అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా మహబూబ్నగర్ వెళ్ళి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ క్లస్టర్ సమావేశానికి హాజరవుతారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలని పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత కరీంనగర్ వెళ్లి కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సభ అనంతరం హైదరాబాద్ చేరుకుని సికింద్రాబాద్ పార్లమెంట్లో పార్టీ నిర్వహిస్తున్న మేధావుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సమావేశంలో పార్టీ మేనిఫెస్టోపై చర్చించనున్నారు. రాత్రికి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.