జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న ముఖ్యమంత్రి
అమరావత : సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా వినుకొండలో
పర్యటించనున్నారు. జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో
ముఖ్యమంత్రి నగదు జమ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి
బయలుదేరి 10.40 గంటలకు వినుకొండ చేరుకుంటారు. 11.05 – 12.20 వినుకొండ
వెల్లటూరు రోడ్లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొని, జగనన్న చేదోడు పథకం
ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న ముఖ్యమంత్రి కార్యక్రమం అనంతరం
మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 1.45 గంటలకు తాడేపల్లి నివాసానికి
చేరుకుంటారు.