రైతన్నలకు అందిస్తున్న ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల
వడ్డీ రాయితీ సొమ్ముతో పాటు, గతంలో వివిధ సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు
పొందని వారి అకౌంట్లలో జమ చేసే సొమ్ముతో కలిపి మొత్తం రూ. 200 కోట్లు
నేడు సీఎం క్యాంప్ కార్యాలయం నుండి బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ
చేయనున్న సీఎం వైఎస్ జగన్
అమరావతి : ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే
నష్టపరిహారం చెల్లిస్తామన్న మాట మరోసారి నిలబెట్టుకుంటూ రైతన్నలకు ఇన్పుట్
సబ్సిడీ. 2022 జులై – అక్టోబర్ మధ్య (ఖరీఫ్‌లో) కురిసిన అధిక వర్షాలు, వరదలకు
పంట నష్టపోయిన 45,998 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతన్నలకు రూ. 39.39 కోట్ల
ఇన్పుట్ సబ్సిడీని ఖరీఫ్ 2022 ముగియక ముందే నేడు నేరుగా వారి ఖాతాలకు జమ
చేయనున్నారు. నేడు జమ చేస్తున్న రూ. 39.39 కోట్లతో కలిపి వైఎస్ జగన్
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల
పంటలు నష్టపోయిన 21.31 లక్షల మంది రైతన్నలకు అందించిన మొత్తం ఇన్పుట్
సబ్సిడీ అక్షరాల రూ. 1,834.79 కోట్లు. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన
రైతన్నలకు సత్వర ఉపశమనం కల్పిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సీజన్లో జరిగిన
పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగానే నష్టపరిహారం పంపిణీ. సీఎం క్యాంప్
కార్యాలయం నుండి బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్
మోహన్ రెడ్డి జమ చేయనున్నారు.
వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు (వరుసగా మూడో ఏడాది)
పంటలు వేసే ప్రతిసారి రైతన్న పెట్టుబడి ఖర్చుల కోసం అధిక వడ్డీల వలలో
చిక్కకూడదన్న ఉద్దేశంతో సన్న, చిన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకు పంట
రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పంట
రుణాలు (వరుసగా మూడో ఏడాది).
రబీ 2020 – 21, ఖరీఫ్ 2021లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 8,22,411
మంది రైతన్నలకు రూ. 160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును వారి ఖాతాల్లో నేడు
నేరుగా జమ
గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ. 1,180 కోట్లు, నేడు అందిస్తున్న రూ. 160.55
కోట్లతో కలిపి వై.ఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి
ఇప్పటివరకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల క్రింద 73.88 లక్షల మంది
రైతన్నలకు అందించిన వడ్డీ రాయితీ రూ. 1,834.55 కోట్లు. అన్నదాతలు అధిక
వడ్డీలతో అప్పుల ఊబిలో కూరుకుపోకుండా వారికి అండగా నిలుస్తూ , ఈ – క్రాప్
డేటా ఆధారంగా లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకుని ఏడాది లోపు తిరిగి
చెల్లించిన రైతన్నలకు పూర్తి వడ్డీ రాయితీని క్రమం తప్పకుండా అందిస్తున్న
జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం ఈ మూడేళ్ళ ఐదు నెలల్లో వివిధ పథకాల క్రింద
రైతన్నలకు అందించిన సాయం రూ. 1,37,975.48 కోట్లు.
గత ప్రభుత్వంలో…
అశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా, రైతన్నలు మధ్యదళారులు, క్షేత్రస్ధాయి
ఉద్యోగుల చుట్టూ ఏళ్ళ తరబడి తిరిగినా పరిహారం అందుతుందో లేదో తెలియని
దుస్ధితి, కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఎగ్గొట్టి, మరికొన్ని సందర్భాలలో రెండు
మూడు సీజన్ల తర్వాతే సాయం అందించేవారు, అదీ అరకొరగానే
వైఎస్ జగన్ ప్రభుత్వంలో…
ఈ– క్రాప్ ఆధారంగా నమోదయిన వాస్తవ సాగుదార్లకు నేరుగా వారి ఖాతాల్లోనే ఏ
సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా పరిహారం, పారదర్శకతకు
పెద్దపీట వేస్తూ సోషల్ ఆడిట్ కొరకు రైతు భరోసా కేంద్రాల్లో లబ్ధిదారుల
జాబితాల ప్రదర్శన, గ్రామ స్ధాయిలోనే రైతులు తమ వివరాలు చూసుకుని పేర్లు
లేకపోతే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు. వెరిఫై చేసి పొరపాటు జరిగితే సరిదిద్దే
కార్యక్రమం.