ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
గుంటూరు : గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో
అగ్రిటెక్ -2022 ఎగ్జిబిషన్ ను ప్రారంభించి, 100కు పైగా ఏర్పాటు చేసిన వివిధ
స్టాల్ లను సందర్శించి, నిర్వాహకులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార,
మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
ముచ్చటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో
ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి, రైతాంగ సంక్షేమానికి అమలవుతున్న పలు
కార్యక్రమాలను మంత్రి కాకాణి వివరించారు. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం
ద్వారా డ్రోన్ పైలెట్ శిక్షణను పూర్తి చేసుకున్న పలువురికి మంత్రి కాకాణి
సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.