రైతులకు ఏమి కావాలో వారినే అడిగి అందజేస్తాం
రైతన్నల గ్రూప్‌ల ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
13, 573 ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ
జెండా ఊపి వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళా ప్రారంభించిన సీఎం
రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేసిన సీఎం జగన్
రూ. 361.29కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు
గ్రూపులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పంపిణీ
గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా పర్యటనలో
వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. దీనిలో భాగంగా
రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
రూ. 361.29కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు
గ్రూపులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పంపిణీ చేశారు. 13,573 ఇతర వ్యవసాయ
పనిముట్లను సైతం సీఎం జగన్ పంపిణీ చేశారు. రైతన్నల గ్రూప్‌ల ఖాతాల్లో
రూ.125.48 కోట్ల సబ్సిడీ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ
‘రైతన్నకు అండగా వైఎస్సార్ యంత్ర సేవా పథకం ఉంది. ప్రతీ ఆర్బీకే పరిధిలో
తక్కువ ధరకు యంత్ర పనిముట్లు అందజేస్తున్నాం. ప్రతీ ఆర్బీకేలో అందుబాటులోకి
రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు ఉన్నాయి. ఆర్బీకే పరిధిలోని
రైతన్నలకు వ్యవసాయ పనిముట్లు అందించాం. ఇప్పటికే 6,525 ఆర్బీకే, 391
క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటయ్యాయి. రైతు గ్రూపులకు కొత్తగా రూ.
361.29కోట్ల విలువైన ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లను అందించాం. ప్రతీ
ఆర్బీకే సెంటర్లో యంత్రాలకు రూ.15లక్షలు కేటాయించాం. ప్రతీ ఆర్బీకే సెంటర్లో
రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, ఏమి అవసరమో వారినే అడిగి అందజేస్తాం. అందులో
భాగంగానే వైఎస్సార్ యంత్ర సేవ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
అక్టోబర్‌లో 7లక్షల మందికి లబ్ధి కలిగేలా యంత్రాలు అందిస్తాం. రైతులందరికీ
మంచి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రైతులకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యం
తీసుకొచ్చాం’ అని అన్నారు.
రైతులకు తక్కువ ఖర్చుతో ఆధునిక వ్యవసాయ పరికరాలను తీసుకురావాలనే ఉద్దేశంతో
‘వైఎస్ఆర్ యంత్రసేవ’ పథకం ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
అన్నారు.రైతులకు తక్కువ ఖర్చుతో ఆధునిక వ్యవసాయ పరికరాలను తీసుకురావాలనే
ఉద్దేశంతో ‘వైఎస్ఆర్ యంత్రసేవ’ పథకం ప్రారంభించినట్లు ఏపీ సీఎం జగన్
అన్నారు. గుంటూరులోని చుట్టగుంటలో నిర్వహించిన వైఎస్ఆర్ యంత్రసేవా పథకం కింద
వ్యవసాయ పరికరాల పంపిణీని సీఎం ప్రారంభించారు. రైతులకు ట్రాక్టర్లు,
హార్వెస్టర్లను ఆయన పంపిణీ చేశారు. దీంతో పాటు రూ.125.48 కోట్ల రాయితీ
మొత్తాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈ
పథకం కింద 2,562 ట్రాక్టర్లు, 100 హార్వెస్టర్లు, 13,573 ఇతర వ్యవసాయ
పరికరాలను అందజేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రెండు విడతల్లో పంపిణీ
పూర్తిచేశామన్నారు. ఇంకా ఎవరైనా మిగిలితే దరఖాస్తు చేసుకోవాలని, వారికి
అక్టోబర్‌లో యంత్ర పరికరాలను అందజేస్తామని తెలిపారు. వైఎస్సార్ యంత్ర సేవ
యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అక్టోబర్‌లో 7 లక్షల మందికి లబ్ధి
కలిగేలా యంత్రాలు అందిస్తాం. రైతులందరికీ మంచి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
ఇప్పటికే 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటు చేశామని,
ప్రతీ ఆర్బీకే సెంటర్లో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు అందుబాటులో ఉంటాయని
తెలిపారు.