రైతులకు మహారాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే హామీ ఇచ్చారు. దక్షిణ ముంబైలోని తన అధికారిక నివాసం ‘వర్ష’లో రైతులను ఉద్దేశించి మంగళవారం ఆయన మాట్లాదారు. ఈ సందర్భంగా అన్నదాతలుగా ఆయన వారిని అభివర్ణించారు. అలాంటివారు అకాల వర్షాలతో నష్టపోయారన్నారు. అకాల, అధిక వర్షాలతో పంటనష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.
తమ ప్రభుత్వం వ్యవసాయదారులకు అండగా నిలుస్తుందన్నారు. అకాల వర్షాల వల్ల రైతులకు జరిగిన పంట నష్టాని కి పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.