విజయవాడ : జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదూరు గ్రామంలో
22 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన
భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
వ్యవసాయంతో పాటు అన్ని సహకార రంగాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.
రైతులకు విత్తనం మొదలు విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని
రకాల సేవలను అందిస్తున్నారని అన్నారు. అదేవిధంగా నేడు మన రాష్ట్రంలో గ్రామ
సచివాలయాల ద్వారా ప్రజలకు మరింత సేవలను అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని తెలిపారు. అదేవిధంగా
గుమ్మడిదూరు గ్రామంలోని ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి
ఒక్కరికి నేరుగా డీబీటి ద్వారా లబ్ధిని చేకూర్చడం జరిగిందని తెలిపారు. గతంలో
సంక్షేమ పథకాలు అందాలంటే రికమండేషన్ ద్వారానో లేదా పచ్చ చొక్కా వేసుకున్న
కుటుంబాలకు మాత్రమే లబ్ధి అందేదని అన్నారు. నేడు మనందరి ప్రభుత్వం అధికారంలోకి
వచ్చాక పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని
తెలిపారు,అదేవిధంగా అన్ని గ్రామాలలో శిథిలా వ్యవస్థకు చేరుకున్న రోడ్లపై
ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా శిధిల
వ్యవస్థకు చేరుకున్న రోడ్లను తొలగించి నూతన రోడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని
తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు,
డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల
రామారావు, గ్రామ సర్పంచ్ నక్క కమల, ఎంపీపీ మార్కాపుడి గాంధీ, జడ్పీటీసీ ఉట్ల
నాగమణి, ఎంపీటీసీ బారు సుధారాణి, కాకని స్రవంతి,సొసైటీ అధ్యక్షులు వేమూరు
శేషగిరిరావు, పెనుగంచిప్రోలు గ్రామ సర్పంచ్ వేల్పుల పద్మ కుమారి, సమైక్య
అధ్యక్షురాలు కాకాని పద్మ,గ్రామ నాయకులు పోపురు రామకోటేశ్వరరావు, పొన్నం
శివాజీ, పొన్నం కోటేశ్వరరావు, వేమూరి ప్రవీణ్, నక్క సుధాకర్, మధుసూదన్ రావు,
లగడపాటి నాగేశ్వరరావు, లగడపాటి వీరయ్య, వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు,
ముఖ్య నాయకులు,అధికారులు పాల్గొన్నారు.