జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
గుంటూరు : ఆంధ్రప్రదేశ్లో రైతులను, వ్యవసాయాన్ని ప్రభుత్వం గాలికి
వదిలేసిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గుంటూరు
జిల్లా తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణ,
గోదావరి డెల్టా ప్రాంతాల్లో పంట కాలువలకు నాలుగేళ్లుగా కనీస మరమ్మతులు
లేవని ఆరోపించారు. రైతులు సొంతంగా డబ్బులు పోగేసుకొని కాలువలు బాగు చేసుకునే
దుస్తితి రాష్ట్రంలో ఉందన్నారు.