మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం : వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ఇచ్చిన సలహాలు, సూచనలతో
జిల్లాలోని రైతులు లాభసాటి పంటలపై దృష్టి సారించాలని మాజీ ఉపముఖ్యమంత్రి మరియు
నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఎప్పటికపుడు ఆధునిక
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని యాంత్రీకరణ దిశగా రైతులు అడుగులు
వేయాలని రైతులకు పిలుపు నిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా
వ్యవసాయ సలహా మండలి సమావేశం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనది వ్యవసాయాధారిత రాష్ట్రమని, రాష్ట్ర ముఖ్యమంత్రి
వ్యవసాయం పట్ల, రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారన్నారు. రైతులు కూడా
కేవలం వరి పంటల వైపే మొగ్గు చూపకుండా తక్కువ నీటి సాంద్రతతో పండే పంటలపై
దృష్టి సారించాలన్నారు. మొక్కజొన్న, రాగులు, వేరుశనగ, అపరాలను సాగుచేయడం
ద్వారా అధిక దిగుబడులను పొందడమే కాకుండా లాభసాటిగా ఉంటుందని సూచించారు. రైతులు
పాత పద్దతులను విడనాడి వ్యవసాయం పట్ల రైతులు మెళకువలు తెలుసు కోవాలన్నారు.
జిల్లాలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సహకరిస్తున్నారని, వారి
సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అధిక దిగుబడి పంటలకు చెందిన
కరపత్రాన్ని పాతపట్నం శాసన సభ్యులు రెడ్డి శాంతి, జిల్లా కలెక్టర్, ఇతర
అధికారులతో కలిసి విడుదల చేసారు.
పాతపట్నం శాసనసభ్యులు రెడ్డి శాంతి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ సలహా మండలి
చాలా బాగా పనిచేస్తుందన్నారు. శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు, సలహాలు
పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. తమ నియోజక వర్గంలో
శాస్త్రవేత్తల సలహాలు ద్వారా రైతులు అధిక దిగుబడులు సాదించారన్నారు. జిల్లా
కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు
ప్రారంభంకానుందన్నారు. కొనుగోళ్లలో రైతులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా
చూడాలన్నారు. రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో అవసరమైన గన్ని
బ్యాగులు, హమాలీలు, రవాణా ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు ఉండరాదన్నారు. రైతుల
నుండి ధాన్యం కొనుగోలు చేయించే పూర్తి బాధ్యతను గ్రామ సహాయకులు తీసుకోవాలని
స్పష్టం చేశారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో గన్ని బ్యాగులు, రవాణా, హమాలీల
వివరాలు, ఫోన్ నెంబర్లు ఉండాలని వీటిపై స్పష్టత అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు.
సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 371 ధాన్యం కొనుగోళ్ల
కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 8 మండలాల్లో కోతలు
మొదలయ్యాయని, పండిన పంటల ఆధారంగా ఆర్.బి.కెల్లో అన్ని సిద్ధం చేస్తున్నట్లు
తెలిపారు. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సిబ్బందికి ఇప్పటికే శిక్షణ
కార్యక్రమాన్ని కూడా నిర్వహించామన్నారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు అవసరమైన
అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. పంటల దిగుబడికి మించి గన్ని బ్యాగులను
సిద్ధం చేశామన్నారు. వంశధార పర్యవేక్షక ఇంజినీర్ డోల తిరుమలరావు మాట్లాడుతూ
వంశధార కుడి,ఎడమ కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు
తీసుకుంటున్నామన్నారు. రైతులు కూడా తక్కువ నీటితో పండే పంటల వైపు
దృష్టిసారిస్తే బాగుంటుందని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ శిమ్మ నేతాజీ, పౌర సరఫరాల
సంస్థ జిల్లా మేనేజర్ పి.జయంతి , జిల్లా వ్యవసాయ అధికారి కె.శ్రీధర్ గత
సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను సభ్యులకు వివరించారు. ఈ
సమావేశంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ కరిమి రాజేశ్వరరావు, రాష్ట్ర
వ్యవసాయ మిషన్ సభ్యులు గొండు రఘురాం, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ జిల్లా
మేనేజర్ పి.బాలకృష్ణ, కృషి విజ్ఞాన కేంద్రం, రాగోలు వ్యవసాయ పరిశోధన
శాస్త్రవేత్తలు డా.పి.ఎస్.సత్యనారాయణ,డా.సిహెచ్. బాలకృష్ణ, డా.కిరణ్
కుమార్,కె.భాగ్యలక్ష్మి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి.జయంతి, పశు
సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా.ఎం.కిషోర్, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్
పి.వి.శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి రత్నాల వరప్రసాదరావు, పట్టు
పరిశ్రమ జిల్లా హెడ్ టి.రాజేంద్రప్రసాద్ బాబు, జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి
ఎం.కాళేశ్వర రావు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు వాసు, సంబంధిత
అధికారులు తదితరులు పాల్గొన్నారు.