విజయవాడ : ఒడిశా లో జరిగిన రైలు ప్రమాద బాధితులకు సకాలంలో స్పందించి సీఎం
జగన్మోహన్ రెడ్డి అందించిన సహాయ సహకారాలు ప్రశంసనీయమని వైసిపి రాష్ట్ర నాయకులు
ఆకుల శ్రీనివాస్ కుమార్ ప్రశంసించారు. ఒడిశా రాష్ట్రం బాలాసోర్ రైల్వే
స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన
బాధితుల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి మానవత దృక్పదం తో వ్యవహరించారని, సంఘటన
జరిగిన వెంటనే స్పందించి మంత్రిని, ముగ్గురు ఐఏఎస్ అధికారులను యాభై అంబులెన్స్
లు వాటితో పాటు మెడికల్ సిబ్బందిని పంపించారని కొనియాడారు. సోమవారం అయన
విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాల తరలింపు కోసం
15 మహా ప్రస్థానం వ్యాన్లు కూడా పంపించారని, ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన
వారికి వారు కోలుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయడమే కాకుండా పరిహారాన్ని కూడా
ప్రకటించి వారిని ఆదుకున్నారని తెలిపారు.
మరణించిన వ్యక్తులకు 10 లక్షలు, గాయపడిన వ్యక్తులకు 5 లక్షలు, స్వల్పంగా
గాయపడిన వ్యక్తులకు 1 లక్ష రూపాయల చొప్పున మంజూరు చేసి జగన్ మోహన్ రెడ్డి
గొప్ప మానవతావాదిగా నిలిచారని ఆకుల పేర్కొన్నారు. రైలు ప్రమాద బాధితులకు సహాయ
చర్యల్లో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతున్నదని
తెలిపారు. ప్రమాదం లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశా భావాన్ని వ్యక్తం
చేశారు. పక్క రాష్ట్రం మనకెందుకులే అని ఉండ లేదని,అక్కడి ఒడిషా ప్రభుత్వం
కన్నా వేగంగా సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం జగన్ మోహన్
రెడ్డిని దేశం యావత్ కీర్తిస్తుందన్నారు. మన రాష్ట్రానికి చెందిన ప్రజలు ఘోర
రైల్ ప్రమాదం జరిగి అల్లాడుతుంటే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన
చంద్రబాబు మాత్రం తన స్వార్థ రాజకీయలు కోసం డిల్లీలో హోం మంత్రి కోసం
ప్రదక్షణలు చేస్తున్నాడని ఆకుల శ్రీనివాస్ విమర్శించారు.