రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ సమీపంలో ఓ సెక్షన్ రైల్వే ట్రాక్ ను పేల్చి
వేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించినట్లు రైల్వే అధికారులు ఆదివారం
ధ్రువీకరించారు. ఈ ఉదంతంపై రాజస్థాన్ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)
దర్యాప్తు చేస్తున్నాయి. ఉదయ్ పూర్-అహ్మదాబాద్ బ్రాడ్గేజ్ మార్గంలో పేలుడు
సంభవించడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. శని, ఆదివారాల్లో అర్ధరాత్రి
స్లంబర్-మేఘా హైవేపై ఓడా రైల్వే బ్రిడ్జి సమీపంలో పేలుడు సంభవించడంతో రైల్వే
ట్రాక్ లు దెబ్బతిన్నాయి. రాత్రి సమయంలో పేలుడు శబ్దం వినిపించడంతో రైల్వే
అధికారులు, పోలీసులు, స్థానిక అధికారులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక
పోలీసులు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), ఎఫ్ఎస్ఎల్ అధికారులు ఘటనా
స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రైల్వే ట్రాక్ పేల్చేందుకు మూడు
కిలోల డైనమైట్ వినియోగించినట్లు సమాచారం.
శనివారం సాయంత్రం 7:30 గంటలకు అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన రైలు రెండు గంటల
వ్యవధిలోనే ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనపై డీజీపీకి సీఎం అశోక్ గెహ్లాట్ తగు
ఆదేశాలు జారీ చేశారు. రెండు వారాల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ ఈ కొత్త
బ్రాడ్గేజ్ ట్రాక్ ను ప్రారంభించిన విషయం గమనార్హం. ఈ ఘటనను ఇంటెలిజెన్స్
వైఫల్యంగా రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా అభివర్ణించారు. అక్టోబర్
31 నుంచి రాజస్థాన్ రైల్ ట్రాక్ పనిచేయడం ప్రారంభించగా..వెంటనే ఇలాంటి సంఘటన
జరగడం ప్రజల్లో ఒకవైపు భయం కలిగించడంతో పాటు శాంతిభద్రతలను
ప్రశ్నిస్తోందన్నారు. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వైఫల్యానికి సీఎం బాధ్యత
వహించాలన్నారు.