ఉండటానికి సహాయపడుతుంది.
*నిమ్మకాయ శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపించడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా,
ప్రకాశవంతంగా ఉంటుంది.
*నిమ్మకాయ ముడుతల చికిత్స మరియు చర్మం ప్రకాశవంతంగా ఉండటానికి చౌక అయిన మరియు
అందుబాటులో ఉండే నివారిణిగా చెప్పవచ్చు.
*నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల మొటిమలకు వ్యతిరేకంగా పోరాడటంలో సాయం
చేస్తుంది.
*అలాగే బరువు కోల్పోవడానికి సహాయపడుతుంది.
* శరీరంలో వ్యర్థపదార్థాలను తొలగించడానికి నిమ్మకాయ నీరు సహాయం చేయుట వల్ల
కొవ్వు తగ్గుతుంది.
*సరైన ఆహారం, శారీరక శ్రమ ఉంటేనే బరువు తగ్గడంలో నిమ్మకాయ నీరు ప్రభావవంతంగా
పనిచేస్తుంది.
*ఛాతీ ఇన్ ఫెక్షన్స్ కి దగ్గు తగ్గించడానికి నిమ్మకాయ నీరు సహాయపడుతుంది.
*ఉబ్బసం అలెర్జీ సమస్యలతో బాధపడుతున్న వారికి నిమ్మకాయ నీరు మంచి చికిత్స అని
చెప్పవచ్చు.
*అంతేకాదు.. నిమ్మకాయలో సిట్రిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటం వల్ల చెడు శ్వాస,
చిగురువాపు, పంటి నొప్పి చికిత్సలో సహాయపడుతుంది.
అదేవిధంగా నిమ్మకాయ రసాన్ని అధికమొత్తంలో తీసుకుంటే పంటి ఎనామిల్ కి హాని
కలిగిస్తుంది.
*జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారు వేడి నీటిని మాత్రమే తీసుకోవాలి.
ఇప్పుడు ఈ గ్లాస్ నీటిలో అరచెక్క నిమ్మరసం పిండాలి. ఇందులో పంచదార కలపకుండా
త్రాగాలి.
*నిమ్మకాయలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. నిమ్మకాయలో యాంటి
ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల రోగ నిరోధక
శక్తి పెరుగుతుంది.
*మెగ్నీషియం ఫాస్పరస్ ఎముకలు, దంతాల బలం కోసం సహాయపడుతాయి.
* శరీరంలో ప్రోటీన్, జీర్ణక్రియకు అవసరమైన జీవరసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.
నిమ్మకాయ నీరు, కాలేయ నిర్విషీకరణ చేసే ఎంజైమ్ లు సంఖ్యను పెంచుతుంది. కాలేయం
దాని బాధ్యతలను మరింత ప్రభావంతంగా నిర్వహిస్తుంది.
*నిమ్మమంచి మలబద్ధక నివారణిగా పని చేస్తుంది. దీంతో శరీరం శుద్ధి జరిగి
మూత్రవిసర్జన రేటు పెరగడానికి కూడా సహాయపడుతుంది.