రూర్కీ : రోడ్డు ప్రమాదంలో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌కు
తీవ్ర గాయాలయ్యాయి. టీమ్ఇండియా క్రికెటర్ పంత్ రోడ్డు ప్రమాదానికి
గురయ్యాడు. అతడు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
దీంతో వాహనంలో మంటలు చెలరేగాయి. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా రూర్కీ
సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడగా అతడిని
ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో తన మెర్సిడెస్ కారును పంతే
నడుపుతున్నట్లు సమాచారం. మంటలు చెలరేగగానే అతడు కారు విండో పగలగొట్టుకుని
బయటకు దూకేశాడని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రమాద తీవ్రతకు కారు
పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో పంత్ తల, మోకాలికి గాయాలయ్యాయి. వీపు భాగం
కాలిపోయింది. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఘటనాస్థలాన్ని
పరిశీలించారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
మెరుగైన చికిత్స నిమిత్తం అతడిని దేహ్రాదూన్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు
పోలీసులు తెలిపారు.