ర్యాన్ రెనాల్డ్స్ అభిమానులందరికీ గుడ్ న్యూస్. ఆయన నటిస్తున్న డెడ్ పూల్-3 త్వరలో రాబోతోంది. ఈ విషయాన్ని రియాన్ రెనాల్డ్స్ స్వయంగా ప్రకటించారు. షాన్ లెవీ దర్శకత్వం వహించిన రాబోయే చిత్రంలో హ్యూ జాక్మన్ వుల్వరైన్గా తిరిగి వస్తానని నటుడు ధృవీకరించారు. ర్యాన్ రేనాల్డ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు. ర్యాన్ రేనాల్డ్స్ పాత్ర మొదట 2009 చిత్రం X-మెన్ ఆరిజిన్స్ లో అలరించాడు. ఈ నెల ప్రారంభంలో జరిగిన డీ23 ఎక్స్పో గురించి ప్రస్తావిస్తూ… “ మేము డీ 23ని మిస్ అయినందుకు చాలా విచారంగా ఉన్నాము. అయితే చాలా కాలంగా తదుపరి డెడ్‌పూల్ చిత్రం కోసం చాలా కష్టపడుతున్నాము. ” అని ర్యాన్ రెనాల్డ్స్ పేర్కొన్నాడు.