మూడు వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసిన ఆసిస్
ఢిల్లీ టెస్టులో తుది జట్టులో ఒక మార్పు.. శ్రేయాస్ రీఎంట్రీ
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్‌తో శుక్రవారం మొదలైన
రెండో టెస్టులో ఆసిస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్
వార్నర్(15)ను షమీ వెనక్కి పంపాడు. కాగా లంచ్‌కు ముందు కీలక ఆటగాళ్లైన
లబుషేన్, స్మిత్‌ను ఒకే ఓవర్లో అశ్విన్ ఔట్ చేవాడు. 3 వరుస బంతుల్లో 2
వికెట్లు పడగొట్టాడు. లబుషేన్ 18 రన్స్ చేయగా, స్మిత్ డకౌట్ అయ్యాడు.
ప్రస్తుతం ఆసిస్ 94/3 స్కోర్‌గా ఉంది. ఖవాజా (50), హెడ్(1) క్రీజ్‌లో
ఉన్నారు.
కాగా, నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో కొనసాగుతుండగా..
తుది జట్టులో ఈరోజు కెప్టెన్ రోహిత్ శర్మ ఒక మార్పు చేశాడు. గాయంతో తొలి
టెస్టుకి దూరంగా ఉన్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌ని తుది జట్టులోకి
భారత్ తీసుకుంది. దాంతో నాగ్‌పూర్ టెస్టుతో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన
సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడింది. ఆ మ్యాచ్‌లో సూర్య 8 పరుగులు మాత్రమే
చేశాడు. తెలుగు క్రికెటర్ కేస్ భరత్‌కి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ వికెట్
కీపర్‌గా ఛాన్స్ దక్కింది. అలానే ఓపెనర్ కేఎల్ రాహుల్ తొలి టెస్టులో
ఫెయిలైనా.. మరో అవకాశం దక్కింది. దాంతో శుభమన్ గిల్ రిజర్వ్ బెంచ్‌కే
పరిమితమయ్యాడు. విరాట్ కోహ్లీకి ఇది హోమ్ గ్రౌండ్కాగా.. చతేశ్వర్ పుజారాకి
ఇది 100వ టెస్టు మ్యాచ్.
ఆస్ట్రేలియా తుది జట్టులో కెప్టెన్ పాట్ కమిన్స్ రెండు మార్పులు చేశాడు. టాప్
ఆర్డర్ బ్యాటర్ రెన్షాపై వేటు వేసి అతని స్థానంలో ట్రావిస్ హెడ్‌ని టీమ్‌లోకి
తీసుకున్నాడు. అలానే బౌలర్ బోలాండ్‌పై వేటు పడగా.. అతని స్థానంలో మాథ్యూ
టీమ్‌లోకి వచ్చాడు.
భారత్ తుది జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), చతేశ్వర్ పుజారా,
విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్ (వికెట్ కీపర్),
అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా తుది జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్కస్ లబుషేన్,
స్టీవ్‌స్మిత్, ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్స్‌కబ్, అలెక్స్ క్యారీ (వికెట్
కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), టాడ్ మర్ఫీ, నాథన్ లయన్, మాథ్యూ ఖునీమెన్