న్యూఢిల్లీ : దేశంలో ఆయుష్ పరిశ్రమ మార్కెట్ సైజు ఒక లక్షా 49 వేల 451 కోట్ల
రూపాయలకు చేరిందని ఆయుష్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. రాజ్యసభలో
మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి
రాత పూర్వకంగా జవాబిస్తూ భారతీయ సాంప్రదాయ వైద్య వేదిక (ఫోరం ఆన్ ఇండియన్
ట్రెడిషనల్ మెడిసిన్) ఆయుష్ రంగంపై జరిపిన పరిశోధనా నివేదిక ప్రకారం 2014-15లో
23 వేల 532 కోట్లు ఉన్న ఆయుష్ మార్కెట్ 2020 నాటికి ఒక లక్షా 49 వేల 451 కోట్ల
రూపాయలకు చేరుకున్నట్లు తెలిపారు.
ఆయుష్ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక
పథకాన్ని రూపొందించింది. అందులో భాగంగా భారతీయ ఆయుష్ తయారీదారులు, సర్వీస్
ప్రొవైడర్లు తమ ఎగుమతులను మరింత వృద్ధి చేసుకునేందుకు వీలుగా పలు రకాల చర్యలు
చేపడుతోందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయుష్ ఉత్పత్తులను ప్రమోట్ చేయడం,
ఆయుష్ వైద్య విధానానికి అంతర్జాతీయ గుర్తింపు సాధించడం, భాగస్వామ్య పక్షాలతో
సంప్రదింపులు, అంతర్జాతీయంగా ఆయుష్ మార్కెట్ ను అభివృద్ధి చేయడం, వివిధ
దేశాలలో ఆయుష్ అకడమిక్ చైర్లు ఏర్పాటు చేస్తూ ఆయుష్‌లో అకడమిక్స్, పరిశోధనలను
ప్రోత్సహించడం, శిక్షణ, వర్క్ షాప్‌లను నిర్వహించడం ద్వారా ఆయుష్ వైద్య
చికిత్సా విధానాలపై అంతర్జాతీయ స్థాయిలో అవగాహనను కల్పించడం వంటి చర్యలు
చేపడుతోందని మంత్రి తెలిపారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారంతో
ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి, సోవా రిగ్పా వైద్య విధానాలకు సంబంధించిన
మందులు ఇతర ఉత్పాదనల ఎగుమతుల కోసం ఆయుష్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్‌ను ఏర్పాటు
చేసినట్లు మంత్రి వివరించారు. అలాగే ఆయుష్ వైద్య విధానాన్ని అంతర్జాతీయంగా
ప్రోత్సహించేందుకు వేర్వేరు దేశాలతో 24 ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది,
ఆయుష్ విధానాలపై పరిశోధనలు, అధ్యయనంపై సహకారం కోసం వివిధ అంతర్జాతీయ
సంస్థలతో 40 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి చెప్పారుని. ఆయుష్ అకడమిక్
చైర్స్ నెలకొల్పేందుకు 15 ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు.
దేశంలో రెండు డబ్ల్యూహెచ్‌వో కొలాబొరేటివ్ సెంటర్లు
ప్రపంచ వ్యాప్తంగా సాంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహిచండంలో బాగంగా ఆయుష్
సెంటర్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపును ఇచ్చిందా, ఆయుష్ విద్యలో ప్రభుత్వం
చేపడుతున్న సంస్కరణల వివరాలు ఏమిటి అంటూ విజయసాయి రెడ్డి అగిడిన మరో ప్రశ్నకు
మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆయుష్ వైద్య విధానంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ
సహకారంతో రెండు కోలాబొరేటివ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.
ఢిల్లీలోని మొరార్జీదేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, గురజాత్‌లోని
జామ్‌నగర్‌లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసర్చ్ ఇన్ ఆయుర్వేద
ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి
ప్రాజెక్ట్ కొలేబోరేషన్ ఒప్పదంలో భాగంగా నాలుగు డబ్య్లూహెచ్‌వో బెంచ్‌మార్క్
డాక్టుమెంట్లను రూపొందించడం ప్రాంరభించిందని ఆయన వెల్లడించారు.