నాథన్ లయాన్(Nathan Lyon) చుట్టేస్తున్నాడు. ఇండియన్ బ్యాటర్లను
వరుసగా పెవిలియన్కు పంపిస్తున్నాడు. ఢిల్లీలో జరుగుతున్న రెండవ టెస్టులో
స్పిన్నర్ లయాన్ ధాటికి ఇండియన బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. రెండో రోజు
ఆట తొలి సెషన్లో లయాన్ అప్పుడే నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
8 ఓవర్లు వేసిన లయాన్ 12 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
రోహిత్ 32, రాహుల్ 17, అయ్యర్ 4 రన్స్ చేసి ఔటయ్యారు. వందో టెస్టు ఆడుతున్న
పూజారా డకౌట్ అయ్యాడు. లంచ్ సమయానికి ఇండియా 35 ఓవర్లలో నాలుగు వికెట్ల
నష్టానికి 88 రన్స్ చేసింది. కొహ్లీ(14), జడేజా (15) క్రీజ్లో ఉన్నారు.