విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకోవడం అమానుషం అని
ట్విటర్ వేదికగా దేవినేని ఉమ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై
లాఠీచార్జి . పరిపాలన చేతకాక దాడులు, దౌర్జన్యాలతో రాజారెడ్డి రాజ్యాంగం అమలు
చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ
చేయడమే లక్ష్యంగా వ్యవహరించే మీ పతనం ఖాయమని హెచ్చరించారు.