ఏపీ జేఏసీ అమరావతి నేతలను చర్చలకు పిలిచిన సీఎస్ జవహర్ రెడ్డి * సీఎస్ జవహర్
రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో చర్చలు * వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న ఏపీ
జేఏసీ అమరావతి నేతలు * ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ కొనసాగుతున్న మూడో దశ
ఉద్యమం * డిపార్టుమెంటు ఉద్యోగుల ఆర్ధికేతర సమస్యలు పరిష్కారించేందుకు
సానుకూలత * 10వ తేదీ తర్వాత నాలుగవ దశ ఉద్యమాన్ని ప్రకటిస్తాం * బొప్పరాజు
వెంకటేశ్వర్లు, పలి శెట్టి దామోదర్ రావు
విజయవాడ : లిఖిత పూర్వక హామీ ఇచ్చేంతవరకు ఉద్యమం కొనసాగుతుందని ఏపీ జేఏసీ
అమరావతి నేతలు స్పష్టం చేశారు. ప్రధానమైన ఆర్దిక పరమైన అంశాలు డిఎ, పీ
ఆర్సి అరియర్స్, పే స్కేల్స్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, 62
సంవత్సరాలు వయోపరిమితిని పబ్లిక్ సెక్టార్, గురుకులాలు, యూనివర్సిటీ
ఉద్యోగులకు వర్తింపు, 12వ పీ అర్సి కమీషనర్ నియామకం తదితర సమస్యలపై స్పష్టమైన
ఆదేశాలు జారీ అయ్యేంతవరకు ఉద్యమం యధాతదంగా కొనసాగుతుందన్నారు. ఈనెల 10 లోగా
ప్రధానమైన ఆర్ధిక అంశాలపై స్పష్టత ఇస్తామని తెలిపారు. ఈనెల 10వ తేదీ తర్వాత
నాలుగవ దశ ఉద్యమాన్ని ప్రకటిస్తాం. ఈ నెల 8 న గుంటూరులో నాలగవ ప్రాంతీయ
సధస్సును నిర్వహిస్తున్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలి శెట్టి దామోదర్
రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న ఉద్యోగ,ఉపాధ్యయ,
కార్మిక,రిటైర్డు, కాంట్రాక్టు & ఔట్ సోర్శింగు ఉద్యోగులు ఎదుర్కొంటున్న
ఆర్ధిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరించాలని ఫిభ్రవరి 13 న ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటి ఇచ్చిన 50 పేజీల డిమాండ్లు
సాదనకోసం నేటికి 85 రోజులుగా వివిద ధశలలో జరుగుతున్న ఉద్యమాలు గుర్తించి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో చర్చలు జరిపినందుకు ప్రభుత్వానికి ఏపీ
జేఏసీ అమరావతి పక్షాన ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇప్పటికే ఈ ఉద్యమం
ప్రారంభించాక ఏపిజెఏసి అమరావతి తో వివిధ సందర్బాలలో ప్రభుత్వ పెద్దలతోను,
ఉన్నతాధికార్లు తోను చర్చలు జరిగిన ప్పటికీ ప్రత్యేకించి శాఖాపరమైన
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు నోటీసు ఇచ్ఛి ఉద్యమం లో ఉన్న ఏపిజెఏసి
అమరావతి రాష్ట్రకమిటి, అనుబంద సంఘాల నాయకత్వాలతో ప్రత్యేకించి చర్చలు జరపి
సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టాలని చేస్తున్న డిమాండ్ మేరకు గురువారం
సియస్ క్యాంపు కార్యాలయంలో జరిగిన చర్చల్లో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల
సమస్యలు పరిష్కారం కొరకు స్పష్టతను ఇచ్చారు. అలాగే కొన్ని సమస్యలు
పరిష్కారానికి ఇప్పటికే కొన్ని జిఓ లు ఇచ్చామని, మిగిలిన సమస్యలపై కుడా
సంబందిత డిపార్టు మెంటు ఉన్నతాధికారులకు నోటీసులో ఉన్న డిమాండ్లు
పరిష్కరించేందుకు ఆదేశాలు కూడా ఇచ్చామన్నారు. సుమారు మూడు గంటలపాటు జరిగిన
చర్చలు చాలా సానుకూల వాతావరణంలో జరిగాయని, ఇంకా పెండింగ్ లో ఉన్న ఆర్దిక,
ఆర్దికేతర ప్రధానమైన, ఆర్దిక పరమైన అంశాలు అనగా నాలుగు పెండింగు డిఎ, పీ ఆర్సి
అరియర్స్, పే స్కేల్స్, స్పెషల్ పే లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, 62

ఉద్యోగులకు వర్తింపు, 12వ పీ అర్సి కమీషనర్ నియామకం తదితర సమస్యలపై
పూర్తిస్దాయిలో పరిష్కారానికి సంబందించి స్పష్టమైన లిఖిత పూర్వక హామి
ఇచ్చేంతవరకు మా ఉద్యమం యదావిధిగా కొనసాగుతుందని, ఈనెల 8 న గుంటూరులో తలపెట్టిన
నాలుగవ ప్రాంతీయ సధస్సుకూడా యదావిధిగా జరుగుతుందని ఏపిజేఏసి అమరావతి స్టెట్
చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసో
షియేట్ చైర్మన్ టి.వి.ఫణి పేర్రాజు, కోశాధికారి వి.వి. మురళికృష్టనాయుడు
సియస్ తో జరిగిన చర్చలు అనంతరం తెలిపారు. ప్రధానమైన ఆర్ధిక పరమైన అంశాలపై
వీలైనంత త్వరగా పరిష్కారం అయితే ఉద్యమాన్ని నిలుపుదల చేసే విషయం చర్చించుకుని
తెలుపుతామన్నారు. ఈ సమావేశంలో పాల్గోన్న ఏపిజెఏసి అమరావతి నాయకులు బొప్పరాజు
వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదర రావు ( ఆర్టిసి),టి.వి.ఫణి పేర్రాజు (కో
ఆపరేటివ్),వి.వి. మురళీ కృష్ణ నాయుడు ( పంచాయతీ రాజ్), యస్. కృష్ణమోహన్
(మునిసిపల్), ఆర్. వసంతరాయులు, చేబ్రోలు కృష్ణమూర్తి( రెవెన్యూ), శ్రీనివాస
రావు, యస్ .మల్లేశ్వర రావు, , జి.బ్రహ్మయ్య, కె. అంజనేయకమార్ (చంటి) )ఎస్.
గోవిందు (హోం గార్డ్స్)జి. శివానంద రెడ్డి, కె. కలంధర్, గిడ్డయ్య, జి.జ్యోతి,
అరలయ్యా (గ్రామ వార్డు),కుమార్ రెడ్డి, రాష్ట్రఅధ్యక్షురాలు దేవి, యస్.
శివకుమార్ రెడ్డి ( యూనిటీ టీం),ఎ.శ్రీనివాసరావు , డి.వి.సుబ్బారావు,
కె.ఆర్.ఆంజనేయులు చర్చలలో పాల్గొన్నారు.