విజయ్ దళపతి కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శ కత్వంలో రూపొందిస్తున్న భారీ
యాక్షన్ చిత్రం ‘లియో’. మాఫియా బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రాన్ని
తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తున్నది. అక్టోబర్ 19న
ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ అగ్ర హీరో ఈ సినిమాలో
అతిథి పాత్రలో నటించనున్నారని గత కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. క్లైమాక్స్
ఘట్టాల్లో ఆ హీరో పాత్ర కథాగమనాన్ని మలుపు తిప్పే విధంగా ఉంటుందని
చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ అతిథి పాత్రలో
నటించబోతున్నారని తెలిసింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ తమిళ మీడియాలో కథనాలు
వెలువడ్డాయి. ఒకవేళ రామ్ చరణ్ ‘లియో’ సినిమాలో భాగమైతే పాన్ ఇండియా స్థాయిలో
మంచి గుర్తింపు ఉంటుందనేది దర్శకనిర్మాతల ఆలోచనగా చెబుతున్నారు.