యువకుల ఏకాభిప్రాయ శృంగార సంబంధాలను నేరంగా పరిగణించడానికి ఉద్దేశించకపోయినా..
లైంగిక దోపిడీ నుంచి మైనర్ పిల్లలను రక్షించడానికి పోక్సో (POCSO) చట్టం
తీసుకువచ్చినట్టు ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. పోక్సో కమ్ రేప్ కేసులో
నిందితుడికి బెయిల్ ఇస్తున్నప్పుడు, జస్టిస్ జస్మీత్ సింగ్ ఇలా అన్నారు. “నా
అభిప్రాయం ప్రకారం, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను లైంగిక
దోపిడీ నుంచి రక్షించడమే పోక్సో లక్ష్యం. ఇది యువకుల ఏకాభిప్రాయ శృంగార
సంబంధాలను నేరంగా పరిగణించలేదు. “

ఏకాభిప్రాయంతో లైంగిక సంబంధం అత్యాచారం ఎలా అవుతుంది?
– ఢిల్లీ హైకోర్టు
– ఢిల్లీ హైకోర్టు
లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ కోసం ఉద్దేశించిన చట్టం పోక్సో అని, 18 ఏళ్లలోపు పిల్లలను లైంగిక దోపిడీ నుంచి రక్షించడమే దీని లక్ష్యమని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. యువకుల మధ్య ఏకాభిప్రాయంతో కూడిన శృంగార సంబంధాలను ఎప్పుడూ నేరంగా పరిగణించలేమన్నారు. తన 17 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసి కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తూ మైనర్ బాలిక తండ్రి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన యువకుడికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ జస్మీత్ సింగ్ పై వ్యాఖ్యలు చేశారు.