చిత్తూరు : యువగళం పాదయాత్ర సందర్భంగా ఎస్.ఆర్.పురం మండలం మెదవాడ పంచాయతీ
ఎస్టీ కాలనీ వాసులు లోకేశ్ ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు.
తమకు స్థిర నివాసాలు లేవని, వాటిని ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్టీ కార్పొరేషన్
నుండి ఎటువంటి లోన్లు అందడం లేదని, ఎస్టీ విద్యార్థులకు ఎటువంటి ఆర్థిక సాయం
అందడం లేదని, టీచర్ ట్రైనింగ్ చేయకున్నా టీచర్ ఉద్యోగాలు ఇచ్చే విధానం
నిలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు లోకేశ్ స్పందిస్తూ విదేశీవిద్య
పథకాన్ని నిలిపివేసి పేద ఎస్టీ విద్యార్థులకు అన్యాయం చేశారని విమర్శించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎస్టీ కార్పొరేషన్ కు నిధులిచ్చి బలోపేతం
చేస్తామని, ఎస్టీ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు.