విజయవాడ : లోకేష్ చేసింది యువగళంయాత్ర కాదని, గందరగోళ యాత్ర అని వైసిపి
రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ ఘాటుగా విమర్శించారు. ఆదివారం ఈ మేరకు
ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి గా చేసిన
చంద్రబాబు విజయవాడ నగరానికి చేసింది ఏమీలేదని తెలుసుకుని ప్రజలు ఎక్కడ
నిలదీస్తారో అని మంది మార్బలాన్ని అడ్డు పెట్టుకుని హడావుడిగా నడుచుకుంటూ
వెళ్ళిపోయాడని ఆకుల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. నగరాభివృద్ది మీద లోకేష్ కు
అవగాహన లేకపోవడం వల్ల మీడియా వాళ్లు ఏమి అడుగుతారో అనే భయం అయన ముఖంలో
స్పష్టంగా కనిపించిందన్నారు. ప్రజల నుండి కష్ట సుఖాలు తెలుసుకునే పాదయాత్ర
లాగా లేదనీ రాత్రిపూట క్యాట్ వాక్ మాదిరిగా ఉందని అన్నారు. నగరానికి ఏమీ
అవసరమో లోకేష్ చెప్పలేక పోయాడని , అయన దృష్టంతా ఆ
పార్టీ గ్రూపు రాజకీయాలు మీదే ఉంది అన్నారు . లోకేష్ పాదయాత్ర వల్ల నగర
ప్రజల్లో స్పందన లేదన్నారు. బయట నుంచి జనాల్ని తీసుకువచ్చి ప్రధాన రోడ్లు మీద
నుంచో పెట్టారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీని జాకీలు పెట్టిలేపినా
ఉపయోగం లేదని ,పెద్ద పెద్ద క్రెన్ లు పదుల సంఖ్యలో తీసుకు వచ్చారని ఆకుల
ఘాటుగా వ్యాఖ్యానించారు. విజయవాడ లో తన తండ్రి చంద్రబాబు చేయలేని అభివృద్ధి,
ఈ నాలుగేళ్లలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసి చూపించారని లోకేష్
తెలుసుకోక తప్పలేదని అన్నారు. లోకేష్ యాత్ర వల్ల ప్రజలలో ఏమాత్రం స్పందన
లేదని ఆకుల విమర్శించారు.