చిత్తూరు : టీడీపీ యువనేత నారాలోకేష్ యువగళం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో
కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం నుంచి 37వ
రోజు యువగళం పాదయాత్ర ను లోకేష్ ప్రారంభించారు. కలికిరి వద్ద లోకేష్ యువగళం
పాదయాత్రకు విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధా సంఘీభావం తెలిపారు. లోకేష్‌తో
పాటు వంగవీటి రాధా పాదయాత్ర చేశారు. కాగా టీడీపీ నేతగా ఉన్న వంగవీటి రాధా ఆ
పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు
టీడీపీలో చేరిన రాధా ఆ పార్టీ తరపున పోటీ చేయకుండా ప్రచారానికే పరిమితం
అయ్యారు. ఈ నాలుగేళ్లలో కూడా రాధా ఏ నియోజవర్గంపైనా కూడా దృష్టి పెట్టలేదు.
ఈసారి మాత్రం టీడీపీని వీడి జనసేనలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
వంగవీటి రాధాను బందరు నుంచి పోటీకి దింపే యోచనలో జనసేన అధినేత ఉన్నట్లు
తెలుస్తోంది. అయితే ఈరోజు టీడీపీ నేత లోకేష్ యువగళం పాదయాత్రకు సంఘీభావం
తెలుపుతూ పాదయాత్రలో పాల్గొనడంతో వంగవీటి రాధా టీడీపీని వీడతారనే ప్రచారం
ప్రచారంగానే మిగిలిపోనుందా అనేది వేచి చూడాలి.