విశాఖపట్నం : విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా
ప్రారంభమయ్యాయి. పీఠాధిపతులు స్వరూపా నందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి
స్వాత్మానందం సరస్వతి మహో స్వాములు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలతో
వార్షికోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా తొలుత గణపతి పూజ అనంతరం రాజ
శ్యామల అమ్మవారికి. వివిధ రకాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠం
ప్రాంగణంలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి యాగశాలను ప్రారంభించారు.
వార్షికోత్సవానికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి స్వరూపానంద
అనుగ్రహభాషణము చేశారు. లోకంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అందుకు ఆ శారదా
అమ్మవారు నిరంతరం అనుగ్రహం అందించాలని కోరుకున్నామన్నారు. రాజ శ్యామల
అమ్మవారు గొప్ప మహిమాన్వితురాలని కొనియాడారు. గొప్ప ఉపాసన మంత్రం తో అమ్మవారు
యాగం జరుగుతుందన్నారు.. వేరే ఎక్కడా ఈ తరహాలో జరగవన్నారు.
వార్షికోత్సవాలు విజయవంతం
విశాఖ శారదా పీఠం ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రతిష్టాత్మకంగా
నిర్వహిస్తున్న వార్షికోత్సవాలు విజయవంతం కావాలనీ, శారదా మాత,రాజ శ్యామల
అమ్మవారు అనుగ్రహము దేశములో ప్రజలందరి పైనా ఉండాలని తాను కోరుకోవడం
జరిగిందని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల
సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు
తెలిపారు. శుక్రవారం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మా నందేంద్రలను కలిసి
వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పీఠం ప్రాంగణంలో దేవత మూర్తులను
దర్శించుకున్నారు. ప్రతి ఏటా పీఠం వార్షికోత్సవాలతో పాటు నిరంతరం నిర్వహించే
అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది అన్నారు. ఈ సందర్భంగా
సింహాద్రి నాథుడు జ్ఞాపికను స్వామీజీలకు శ్రీనుబాబు అందజేశారు.