విజయవాడ పశ్చిమ : పవిత్ర శుక్రవారం సందర్భంగా భవానిపురం దర్గాలో పాల్గోని జులై
4 వ తేదిన తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరిగే మాజీ శాససభ్యులు వంగవీటి మోహన
రంగా 76వ జయంతి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కమిటి సభ్యులతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ స్వర్గీయ రంగాతో ఈ ప్రాంత ప్రజలలో
మంచి సన్నిహిత సంబంధం ఉండేది. ఆ రోజుల్లో ఇక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే
స్పందించే వారు. రంగా అనేక సార్లు ఈ దర్గాలో జరిగిన ప్రార్ధనలో, ఉరుసు ప్రతి
ఏడాది జరిగే ఉరుసు ఉత్సవాల్లో పాల్గొని అల్లా ఆశీర్వాదాలు తీసుకునే వారు.
ప్రతి ఒక్కరు రంగా జయంతి కార్యక్రమం లో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ
కార్యక్రమంలో కమిటి సభ్యులు అబ్దుల్ సత్తార్ , ముస్తాక్, కమిటి సభ్యులు,
స్థానిక పెద్దలు పాల్గొన్నారు.