గుజరాత్లోని మోర్బిలో వంతెన కూలిపోవడంపై పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వంతెన తెగిన ప్రమాదంలో దాదాపు 90 మంది మరణించారు. ఇదొక “మానవ నిర్మిత విషాదం”గా కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా అభివర్ణించారు దీనికిన రాష్ట్ర ప్రభుత్వమే దీనికి ప్రత్యక్ష బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా ప్రమాదంపై స్పందించారు. “దేవుని చర్యనా లేదా మోసపూరిత చర్య” అనిదిగ్విజయ్ ప్రశ్నించారు.